Rasi Phalalu: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది.. కొత్త పనులకు శ్రీకారం చుడతారు..! | Today Telugu Horoscope On May 25th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది.. కొత్త పనులకు శ్రీకారం చుడతారు..!

Published Sat, May 25 2024 6:20 AM

Rasi Phalalu On 25-05-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.విదియ సా.6.39 వరకు, తదుపరి తదియ నక్షత్రం: జ్యేష్ఠ ఉ.10.35 వరకు, తదుపరి మూల, వర్జ్యం: సా.6.39 నుండి 8.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.30 నుండి 7.07 వరకు అమృతఘడియలు: తె.4.33 నుండి 5.24 వరకు(తెల్లవారితే ఆదివారం).  

మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణ వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: నూతన పరిచయాలు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం: వ్యయప్రయాసలు. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: బంధువులతో తగాదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కన్య: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలిసివస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. గృహయోగం. చర్చలు సఫలం. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు మధ్యలో వాయిదా పడతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. రుణయత్నాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

Advertisement
 
Advertisement
 
Advertisement