
రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని శివాజీచౌక్‌లో ప్రమాదవశాత్తు రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. జిల్లా కేంద్రానికి చెందిన వి జయ్‌కేతన్ తన ఎలక్ట్రిక్ స్కూటీని శివా జీచౌక్‌లోని చించరవాడ హనుమాన్ ఆలయం ఎదు ట మంగళవారం పార్కింగ్ చేశాడు. ఆ సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనున్న మరో యాక్టీవ బైక్‌కు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పి వేసేందుకు యత్నించగా, అప్పటికే రెండు వా హనాలు కాలిబూడిదయ్యాయి. వాహనాల య జమానులు అయోమయానికి గురయ్యారు.