-
బిక్రమ్ చౌదరికి అరెస్ట్ వారెంట్
లాస్ఏంజెలిస్: ప్రముఖ భారత సంతతి యోగా గురువు బిక్రమ్ చౌదరి(69)పై అమెరికాలోని ఓ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో రూ.70 లక్షలు పరిహారాన్ని చెల్లించాలని గతేడాది కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో న్యాయస్థానం అరెస్టుకు ఆదేశించింది. తాను ఆర్థికంగా దెబ్బతినడం వల్ల నష్టపరిహారాన్ని చెల్లించలేనని బ్రికమ్ ఇంతకుముందు వెల్లడించారు. మరోవైపు అరెస్టును తప్పించుకునేందుకు బిక్రమ్.. ఇప్పటికే అమెరికా నుంచి పరారై ఉండొచ్చని అధికారులు తెలిపారు. గతేడాది జనవరిలో ఓ యోగా విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో పాటు ఇద్దరు ఉద్యోగినుల్ని అకారణంగా తొలగించడంతో బిక్రమ్పై కోర్టు విచారణ ప్రారంభించింది. 1970లో అమెరికాలోని బేవర్లీ హిల్స్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించిన బిక్రమ్ అనతికాలంలోనే చాలా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించారు. పాప్ గాయని మడోన్నా, టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే వంటి ప్రముఖులు బిక్రమ్ శిక్షణా తరగతులకు హాజరయ్యేవారు. 26 ఆసనాలతో వేడిగా ఉండే గదిలో చేసే ‘హాట్ యోగా’ను బ్రికమ్ సృష్టించారు. -
‘ఆడవాళ్లు నేనంటే పడి చస్తారు’
న్యూయార్క్: ‘ఆడవాళ్లు నేనంటే పడి చస్తారు. ఎవరిని రేప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆడవాళ్లు నేనంటే ఇష్టపడతారు. నన్ను ప్రేమిస్తారు. నేను నిజంగా ఆడవాళ్లతో సెక్స్ కోరుకుంటే ఎవరిపైనా అత్యాచారం చేయాల్సిన అవసరమే నాకు లేదు’ అని పలువురు యోగా శిష్యుల నుంచి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బిక్రమ్ హథ యోగా వ్యవస్థాపక గురువు, 69 ఏళ్ల బిక్రమ్ చౌధురి సీఎన్ఎన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లోని 720 యోగా పాఠశాలలకు గురువుగా గుర్తింపు పొందిన బిక్రమ్ తనపై వచ్చిన ఆరోపణల గురించి మొదటి సారి నోరు విప్పారు. ఆయన శిష్యుల్లో చెల్సియా క్లింటన్, మడోనా, డెమీ మోర్లాంటి ప్రముఖులు ఉన్నారు. అమెరికా మాజీ ఆధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్లకు తాను యోగా నెర్పానని ఆయన చెప్పుకుంటారు. 1973లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ యోగా నేర్పాల్సిందిగా తనను ఆహ్వానించారని కూడా చెప్పుకుంటాడు. అలాగే ప్రముఖ పాప్ సింగర్స్ లేడీ గగా, జెన్నీఫర్ అనిస్టన్లకు, టెన్నీస్ ఛాంపియన్ ఆండి ముర్రేకు కూడా తానే యోగా నేర్పానంటాడు. కోల్‌కతాలో పుట్టిన బిక్రమ్ మూడవ ఏటనే యోగా అభ్యాసం మొదలుపెట్టారు. 13వ ఏటా భారత జాతీయ యోగా ఛాంపియన్ షిప్ అందుకున్నాడు. అప్పట్లో రోజుకు ఆరు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. ప్రస్తుతం ఎప్పుడు యోగా ముద్రలోనే ఉంటానంటాడు. 105 ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలో 90 నిమిషాలపాటు యోగా చేయడం మాత్రం నిజమే. తనతోపాటు యోగాలో శిక్షణ ఇచ్చే రాజశ్రీ చౌధురి ఆయన భార్య. ఆయనపై వచ్చిన రేప్ ఆరోపణలపై ఆయన భార్య ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా ఉద్రేకానికిలోనైన ఆయన ‘నా భార్య నావైపు ఎప్పటికి చూడరు’ అని సమాధానం ఇచ్చారు. ‘రోజుకు 24 గంటలు పనిచేస్తాను. ఈ భూ ప్రపంచంలో ఎవరూ నా అంత కష్టపడి పనిచేయరు. అలాంటిది నాపై రేప్ ఆరోపణలా. గిట్టని వారెవరో వారిచేత అలాంటి ఆరోపణలు చేయిస్తున్నారు. వారిని చూసి జాలి పడుతున్నాను’ అని బిక్రమ్ చెప్పారు. 2013 నుంచి మొత్తం ఆరుగురు ఆయన శిష్యులు తమపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపించారు. వారు ఆయనపై కేసులు కూడా పెట్టారు. వాటిలో కొన్నింటిని సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా కొట్టి వేశారు. బాధితుల్లో ఒకరైన సారా బావ్గన్ పెట్టిన కేసు ఇంకా విచారణలో ఉంది. తనను యోగా పాఠశాల ఆఫీసు గదిలోకి పిలిచి అత్యాచారానికి ప్రయత్నించడం నిజమని సీఎన్ఎన్ ఛానల్ ముందు కూడా ఆమె తెలిపారు. ‘నేను తాపంతో చచ్చి పోతున్నాను. సెక్స్‌కు ఒప్పుకోకపోతే నే ను నిజంగా చచ్చిపోతాను’ అని యోగా గురువు బిక్రమ్ బ్రతిమాలినా, బెదిరించినా వినిపించుకోకుండా ఆయన నుంచి తప్పించుకొని బయటపడ్డానని ఆమె తన కేస్‌షీట్‌లో ఆరోపించింది. -
బిక్రం చౌదరీపై లైంగిక వేధింపుల ఆరోపణలు
భారతీయ అమెరికన్ ప్రముఖ భారతీయ యోగా గురువు బిక్రం చౌదరీ(69)పై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. అమెరికా పోలీసులు ఆయనకు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఆరుగురు మహిళలపై భారత్‌తో సహా వేర్వేరు ప్రాంతాల్లో ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు సమన్లలో పేర్కొన్నారు. బిక్రం చౌదరీకి భారత్‌తోపాటు అమెరికాలో కూడా యోగా పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడే తనవద్ద యోగా పాఠాలు నేర్చుకునేందుకు చేరిన కెనడియన్ జిల్ లాలర్ అనే మహిళ ఆయనపై ఈ ఫిర్యాదులు చేసింది. పలుమార్లు ఆయన తనతో అసభ్య కరంగా ప్రవర్తించారని, అడ్డుకోవాలని చూస్తే తన సీటును రద్దు చేస్తానని, చంపేస్తానని బెదిరించేవారని ఫిర్యాదులో పేర్కొంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్‌లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
- 200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement