
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనానికి రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ షోను కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల భవనానికి ఏర్పాటు చేసిన లైటింగ్, లేజర్ షో, మ్యూజిక్ ఫౌంటెన్లు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు.



























