విమాన ఇంజన్ లో దాక్కున్నాడు! | Russian workers find man hiding in plane's engine | Sakshi
Sakshi News home page

విమాన ఇంజన్ లో దాక్కున్నాడు!

Aug 7 2014 3:45 PM | Updated on Oct 8 2018 3:07 PM

విమాన ఇంజన్ లో దాక్కున్నాడు! - Sakshi

విమాన ఇంజన్ లో దాక్కున్నాడు!

ఇప్పటికే విమాన ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన చెందుతుంటే.. విమానంలో తాజాగా మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

మాస్కో:ఇప్పటికే విమాన ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన చెందుతుంటే.. విమానంలో తాజాగా మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రష్యాకు చెందిన జెట్ లైనర్ విమానంలో ఓ వ్యక్తి ఇంజన్ లో దాక్కుని ప్రయాణించిన ఘటన కలకలం రేపింది. కెమిరోవా నగరం నుంచి బయల్దేరిన జెట్ లైనర్ విమానం హుర్ ఘడా వద్ద ల్యాండ్ అయిన అనంతరం ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. అక్కడ్నుంచి మరొక చోటుకి విమానాన్ని సిద్ధం చేసే క్రమంలో ఓ వ్యక్తి ఇంజన్ లో ఉండటాన్ని రష్యా కార్మికులు గుర్తించి అధికారులకు తెలియజేశారు.

 

దీంతో అతన్ని విమాన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఎటువంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. అసలు విమాన ఇంజిన్ లోకి ఎలా వెళ్లాడనే దానిపై కూడా వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నందువల్ల అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement