జపాన్లో భారీ భూకంపం; ఢిల్లీలోనూ ప్రకంపనలు | major earthquake shakes japan, tremors felt in delhi too | Sakshi
Sakshi News home page

జపాన్లో భారీ భూకంపం; ఢిల్లీలోనూ ప్రకంపనలు

May 30 2015 5:25 PM | Updated on Sep 3 2017 2:57 AM

జపాన్లో భారీ భూకంపం; ఢిల్లీలోనూ ప్రకంపనలు

జపాన్లో భారీ భూకంపం; ఢిల్లీలోనూ ప్రకంపనలు

జపాన్లోని బొనిన్ ఐలండ్స్ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. దాంతో భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. భూకంపాలను రికార్డు చేసే రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.5గా నమోదైంది.

జపాన్లోని బొనిన్ ఐలండ్స్ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. దాంతో భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. భూకంపాలను రికార్డు చేసే రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.5గా నమోదైంది. అయితే ప్రస్తుతానికి సునామీ వచ్చే ముప్పు మాత్రం ఏమీ లేదని నిపుణులు తెలిపారు. గతంలో జపాన్లో వచ్చిన భారీ భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

కాగా, జపాన్ భూకంపం ప్రభావంతో.. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ ప్రాంతంలో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement