హాస్టల్‌లో నిద్రస్తున్న విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు
బిచ్‌కొండ(నిజామాబాద్ జిల్లా): హాస్టల్‌లో నిద్రస్తున్న విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా బిచ్‌కొండ మండలం పెద్దకొడగ్గల్ గ్రామంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో జరిగింది. వివరాలు.. ఐదోతరగతి చదువుతున్న సంతోష్ అనే విద్యార్థి ఎస్టీ బాలుర హాస్టల్‌లో ఉంటున్నాడు.
బుధవారం తెల్లవారుజామున హాస్టల్‌లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. దీంతో బాలుడిని వెంటనే బాన్సువాడలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతానికి బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.