కరోనా వేస్ట్‌ ట్రాకింగ్‌కు యాప్‌!

TPCB Guidelines On Corona Waste Management In Telangana - Sakshi

త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం

ఇప్పటిదాకా ‘బార్‌కోడ్‌’ వ్యవస్థ ద్వారా వ్యర్థాల గణన

కరోనా వ్యర్థాల నిర్వహణపై టీపీసీబీ మార్గదర్శకాలు

కరోనా పాజిటివ్‌ రోగులు, అనుమానితులకు సంబంధించిన వైద్య వ్యర్థాల సేకరణ, నిర్వహణ, రవాణా, శుద్ధి ప్రక్రియలు, నిర్మూలన వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌ సిద్ధమైంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ రోగులు, అనుమానితుల జీవ వ్యర్థాల నుంచి కూడా వైరస్‌ సోకుతుందే మోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. దీంతో ఈ వ్యర్థాల సురక్షిత నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఈ యాప్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) రూపొందించింది. ప్రస్తుతం కరోనా విస్తృతి కొనసాగుతున్నం దున, ఈ బయో మెడికల్‌ వేస్ట్‌ పర్యవేక్షణ పకడ్బందీగా చేసేందుకు త్వరలోనే ఈ యాప్‌ను ఉపయోగంలోకి తీసుకు రానున్నారు.

ఈ జీవ వ్యర్థాల సేకరణ మొదలు, వేరు చేయడం, రవాణా, నిర్మూలన వరకు సురక్షితంగా చేపట్టేలా ఈ యాప్‌ ద్వారా పర్యవేక్షిస్తారు. దీనికి సంబంధించి ప్రతి ప్రక్రియను జియో ట్యాగింగ్‌ చేయ డంతో, ఈ వివరాలను కామన్‌ ఫ్లాట్‌ఫారంలో సబ్మిట్‌ చేస్తారు. ఇప్పటివరకు రోజూ రాష్ట్రంలో సేకరించే జీవ వ్యర్థాల పరిమాణం లెక్కింపు నకు బార్‌కోడింగ్‌ వ్యవస్థ ఉపయోగిస్తూ వచ్చారు. ఇకపై ఈ యాప్‌ ద్వారా కేంద్రీకృత పర్యవేక్షక వ్యవస్థలో భాగంగా ట్రాకింగ్‌ చేస్తారు. ఇందుకు ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ను విని యోగించడంలో భాగంగా ఈ యాప్‌లో వ్యర్థాల ఉత్పత్తిదారులు, దీన్ని రవాణా చేసే వారు, ట్రీట్‌మెంట్‌ చేసేవారు రిజిస్టర్‌ చేసుకుని, పసుపు, ఎరుపు బ్యాగుల్లోని చెత్త ఎంత పరిమాణంలో ఉందో వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

కరోనా వేస్ట్‌పై పీసీబీ మార్గదర్శకాలు..
► వార్డుల్లో చెత్తబుట్టలు/ సంచులు/ కంటైనర్లను ఉంచి జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు వాటిని వేరు చేసి నిర్వహించాలి.
► ఎర్ర రంగు సంచిలో వాడిన గాగుల్స్, ఫేస్‌ షీల్డ్, యాప్రాన్, ప్లాస్టిక్‌ కవర్లు, హాజ్మెట్‌ సూట్, గ్లోవ్స్‌ వంటి వస్తువులు వేయాలి.
► పసుపు రంగు సంచిలో వాడిన మాస్క్‌ లను, హెడ్‌–కవర్‌/క్యాప్, షూ కవర్, డిస్పో జబుల్‌ లైనిన్‌ గ్లోవ్స్, నాన్‌–ప్లాస్టిక్‌ లేదా సెమీ ప్లాస్టిక్‌ కవర్లు వేయాలి.
► కరోనా వార్డులకు సంబంధించిన జీవ, వైద్య వ్యర్థాలను తరలించే సంచులు, కంటై నర్లపై ‘కరోనా వ్యర్థాలు’ అని పేర్కొనాలి. వీటికి ప్రాధాన్యం ఇచ్చి, వెంటనే తరలించేందుకు.. చూడగానే గుర్తు పట్టడానికి వీలుగా ఏర్పాటు చేయాలి.
► పట్టణ, స్థానిక సంస్థలు అందచేసే పసుపు రంగు సంచుల్లో క్వారంటైన్‌ కేంద్రాల నుంచి లేదా వైద్య శిబిరాల నుంచి జీవ వైద్య వ్యర్థాలను విడిగా తరలించాలి.
► స్వీయ నిర్బంధం పాటిస్తున్న ఇళ్లు లేదా ఇతరత్రా ఇళ్ల నుంచి వాడేసిన మాస్కులు, గ్లోవ్స్‌ను సాధారణ చెత్తలాగా నిర్మూలించేం దుకు ముందు కనీసం 72 గంటల పాటు కాగితపు సంచుల్లో ఉంచాలి. 
► ఎర్ర రంగు సంచులను.. కరోనా సోకినవారి నుంచి నమూనాలు సేకరించే కేంద్రాలు, ప్రయోగశాలలు, నమూనాలను సేకరించేం దుకు, తరలించేందుకు ఉపయోగించే ప్లాస్టిక్‌ సీసాలను, ట్యూబ్‌లను, పిప్పెట్లను ఉంచడానికి వాడాలి.

చేయకూడని పనులు..
► కరోనా వ్యర్థాలను ఇతర వ్యర్థాలతో కలపకూడదు. తగినంత వ్యక్తిగత రక్షణ ఏర్పాట్లు లేకుండా కరోనా వ్యర్థాల దగ్గరకు వెళ్లకూడదు. వ్యర్థాలను 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు.
► అనారోగ్య లక్షణాలున్న ఏ ఒక్క కార్మికుడిని విధి నిర్వహణకు అనుమతించొద్దు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top