
'హామీల అమలు పాతాళం దాటి పైకి రాలేదు'
సీఎం కేసీఆర్ కు 28 అంశాలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లేఖ రాశారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు 28 అంశాలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లేఖ రాశారు. 70 రోజుల పాలనలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదని తెలిపారు. ప్రభుత్వ హామీల అమలు పాతాళం దాటి పైకి రాలేదని ఎద్దేవా చేశారు.
రుణమాఫీపై స్పష్టత లేక పోవడం, రైతులకు కొత్త రుణాలు రాకపోవడం, విద్యుత్ కొతలు పెరగడం వల్ల130 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. స్థానికత అడ్మిషన్లు, సామాజిక సర్వే, ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు వంటి అన్ని అంశాలలో గందర గోళం నెలకొందని తన లేఖలో పొన్నాల పేర్కొన్నారు.