అంతా వారిష్టం..

No Toilets And Petrol Quality in Bunks - Sakshi

పెట్రోల్‌ బంకుల్లో ఇష్టారాజ్యం  

నిబంధనలకు తూట్లు..

గాలి,తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కరువు

నామమాత్రంగా నాణ్యత పరీక్షలు

సాక్షి,సిటీ బ్యూరో: గ్రేటర్‌ పరిధిలోని పెట్రోల్‌ బంకుల్లో ప్రతి రోజూ దాదాపు 40 లక్షల వాహనాలు ఇంధనం పోయించుకుంటుంటాయి. పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు వాహనాల్లో పొస్తున్న ప్రతి చుక్కకు సొమ్ము చేసుకుంటుంటారే తప్ప వినియోగదారులకు కనీస సౌకర్యాల కల్పనలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు.ఏకంగా బంకుల యాజమాన్యాలు చమురు సంస్థల నిబంధనలను సైతం తుంగలో తొకేస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్‌ బంకులకు వస్తున్న వాహనదారులకు  ఇంధనం తప్ప ఇతర సేవలు అందని దాక్ష్రగా మారాయి.  పౌరసరఫరాల శాఖ, జైళ్ల శాఖ ఆధ్వరంలో నడిచే పెట్రోల్‌ బంకుల్లో మాత్రం సౌకర్యాలు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి తప్ప మిగిలిన ఆయిల్‌ కంపెనీల  ఔట్‌ లేట్, ప్రయివేటు బంకుల్లో వాటి ఊసే కనిపించడం లేదు. పెట్రోల్‌ బంకులకు వచ్చే వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ వేసి పంపడమే కాదు... వాహనాల్లో ఉచితంగా  గాలి, వాహనదారులకు  తాగు నీరు, మరుగు దొడ్లు సౌకర్యం ఖచ్చితంగా కల్పించాల్సి బాధ్యత యాజమాన్యాలపై ఉంది. మరోవైపు  పెట్రోబంకుల్లో  ఇంధనం నాణ్యత పరీక్ష పరికరాలను అందుబాటులో ఉంచాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎండ, వానల నుంచి రక్షణకు తగిన నీడ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.  అయితే పెట్రోల్‌ బం కుల నిర్వాహకులు వీటిని పట్టించుకోవడం లేదు.

నగరంలో 60.34 లక్షల వాహనాలు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 60.34 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 44.04 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరత్ర వాహనాలు 20.30 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. మహానగర పరిధిలో సుమారు 560 పైగా పెట్రోల్, డీజిల్‌ బంక్‌లు ఉండగా, ప్రతిరోజు సగటున 40 లక్షల లీటర్ల పెట్రోల్,  30 లక్షల  డీజిల్‌  వినియోగమవుతోంది.  

జాగ్రత్తలేవీ....
పెట్రోల్‌ బంకుల ఏర్పాటు సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు  అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే తక్షణమే చర్యలు తీసుకునేందుకు అనువుగా పరిసరాలు ఉండాలి. పెట్రో బంకులకు మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో  ప్రహరీ, బకెట్‌లలో  ఇసు క. సమీపంలో నీరు అందుబాటులో ఉంచాలి.  మరోవైపు ఫస్టె్టయిడ్‌ కిట్‌లు అత్యవసరం. సిబ్బం దికి అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే శిక్షణ  ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించిన ధృవప త్రం యాజమాన్యం వద్ద ఉండాల్సి ఉంటుంది. బంకుల వద్ద విద్యుత్‌ తీగలు బయటకు కనిపించకుండా   చర్యలు తీసుకోవడంతో పాటు సమీపం లో  హైటెన్షన్‌  తీగలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పొగతాగరాదు బోర్డులను  ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. అయితేఇవేమి బంకుల్లో కనిపించవనేది జగమేరిగిన సత్యం.

ఉచితంగా గాలి...
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం నింపుకున్న వాహనాల్లో ఉచితంగా గాలి నింపాలి. ఎండ కాలం కారణంగా చల్లని మంచి నీరు అందుబాటులో ఉంచాలి. మరుగు దొడ్లు ఏర్పాటు చేసి వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించాలి. బంకుల్లో కనీసం 20 లీటర్ల పెట్రోల్, 50 లీటర్ల  డీజిల్‌  నిల్వ నిరంతరం ఉండాలి. అంబులెన్స్,  పోలీసు, వికలాంగులకు ఇంధనం లేదనుకుండా పోయాల్సి ఉంటుంది.

నాణ్యత పరీక్షలు ఇలా..
వినియోగదారులు ఇంధనం కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరిశీలించవచ్చు. పెట్రోల్‌ బంకుల్లో నాణ్యత పరిశీలనేది ఖచ్చితంగా ఉండాలి. పెట్రో బంకుల్లో ఇంధనం నాణ్యతను పరిరక్షించేందుకు  హైడ్రో ధర్మా మీటర్లు  అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు అడిగితే వాటిని ఇచ్చి ఇంధనం  నాణ్యత పరీ రక్షించడానికి సహకరించాలి..పెట్రోల్‌ బంకుల్లో హైడ్రోమీటర్, ఫిల్టర్‌ పేపర్, ఐదు లీటర్ల క్యాన్‌ అందుబాటులో ఉంచడమేగాక వినియోగదారులు అడిగిన వెంటనే  అందజేయాల్సి ఉంటుంది. పెట్రోల్‌లో హైడ్రోమీటర్‌ పెట్టినప్పుడు సాంద్రత  700–760 మధ్యలో , డీజిల్‌ 800–860 చూపితే నాణ్యమైనది. కొలతల్లో అనుమానం ఉంటే క్యాన్‌లో పోయించుకొని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు పెట్రో బంకుల యాజమానులు మాత్రం అనుమతించడం లేదు. ఇంధనం నాణ్యతను పరిరక్షించే అధికారం  వినియోగదారులకు ఉంటుంది.  అందుకు సంబంధించిన  కిట్‌లను వారు కోరినప్పుడు  బంక్‌  సిబ్బందికి అందించాలి.  కిట్‌లు అందుబాటులో లేకపోయినా, వాటిని ఇవ్వడానికి  వెనుకాడినా  మోసం జరుగుతుందని గ్రహించాలి. కల్తీ ఉందా అనేది తెలుసుకోవాలంటే  ఫిల్టర్‌ పేపర్‌పై ఒక్క చుక్క  ఇంధనం వేస్తే పది సెకన్లలో ఆవిరి అయిపోతుంది.  ఆరిన తర్వాత  పేపర్‌పై మరక కనిపించకూడదు  మరక కనిపిస్తే  కల్తీ జరిగినట్లు గ్రహించాలి. హైడ్రో మీటర్ల ద్వారా కూడా నాణ్యత తెలుసుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top