తెల్లారితే పెళ్లి.. వధువు అదృశ్యం | Bride Disappear in Banjara Hills | Sakshi
Sakshi News home page

తెల్లారితే పెళ్లి.. వధువు అదృశ్యం

Aug 30 2018 9:18 AM | Updated on Aug 30 2018 9:18 AM

Bride Disappear in Banjara Hills - Sakshi

బంజారాహిల్స్‌: మరికాసేపట్లో... పెళ్లి జరుగనుండగా పెళ్లి కూతురు అదృశ్యమైన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఫిలింనగర్‌ సమీపంలోని హకీంపేట్‌కు చెందిన సంతోషి(19) వివాహం సికింద్రాబాద్‌కు చెందిన జైపాల్‌తో నిశ్చయమైంది. గురువారం ఉదయం జుమ్మరాత్‌బజార్‌లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం వధువు, వరుడి ఇళ్లల్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురును చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే బుధవారం ఉదయం 10గంటల ప్రాంతంలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్లిన సంతోషి మధ్యాహ్నం వరకు తిరిగి రాలేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరి స్వప్న బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement