'2019లో కేసీఆర్‌ ఎవరంటే వారే సీఎం' | boora narshaiha goud comments on cm kcr | Sakshi
Sakshi News home page

'2019లో కేసీఆర్‌ ఎవరంటే వారే సీఎం'

Jan 28 2017 2:30 PM | Updated on Sep 5 2017 2:21 AM

'2019లో కేసీఆర్‌ ఎవరంటే వారే సీఎం'

'2019లో కేసీఆర్‌ ఎవరంటే వారే సీఎం'

రానున్న 2019 ఎన్నికల విషయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌: రానున్న 2019 ఎన్నికల విషయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అప్పుడు కేసీఆర్‌ ఎవరంటే వారే టీఆర్‌ఎస్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపడుతారని ఆయన వ్యాఖ్యానించారు. 2019లో సీఎం ఎవరన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పలు ఊహాగానాలకు తావిచ్చేలా ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2019లో కేసీఆర్‌ నిర్ణయించిన వారే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలతో.. 2019లో కేసీఆర్‌ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టబోరా? అన్న చర్చకు తెరలేచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement