వైరల్ ఫీవర్ స్వైన్ ఫ్లూ నగరవాసుల్ని వణికిస్తోంది.
హైదరాబాద్: వైరల్ ఫీవర్ స్వైన్ ఫ్లూ నగరవాసుల్ని వణికిస్తోంది. 18 నెలల చిన్నారి స్వైన్ ఫ్లూ లక్షణాలను కల్గి ఉండటంతో ఆదివారం గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఇప్పటి వరకూ స్వైన్ ఫ్లూతో ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 15 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిపారు.