పాక్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ అదిరింది

Team India Fans Trolls  ICC Tweet Over Champions Trophy Result - Sakshi

హైదరాబాద్ ‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా జయభేరి మోగించిన విషయం తెలిసిందే. రోహిత శర్మ సూపర్‌ సెంచరీతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో దాయాది పాక్‌పై కోహ్లి సేన సునాయసయంగా విజయం అందుకుంది. అయితే ఐసీసీ చాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌లో పాక్‌ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది ఇదే రోజు(జూన్‌ 18న). సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు ఓవల్‌లో చాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌ భారత్‌ను పాక్‌ ఓడించిందని ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై టీమిండియా అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. 

ఏ గడ్డపై ఓడిపోయామో అదే గడ్డపై మట్టికరిపించాం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ‘పాకిస్తాన్‌కు టీమిండియా ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ అదిరింది’ , ‘చాంపియన్‌ ట్రోఫీ జరిగిన ఇంగ్లండ్‌లోనే ప్రపంచకప్‌లో పాక్‌ పనిపట్టాం’ ‘రెండు సంవత్సరాలకు రెండు రోజుల ముందే పాక్‌పై బదులు తీర్చుకున్నాం’అంటూ మరికొందరు ట్వీట్‌ చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్తాన్‌ 180 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

చదవండి: 
ఐసీసీకి సచిన్‌ కౌంటర్‌!
గురి తప్పకుండా.. బ్యాట్స్‌మన్‌కు తగలకుండా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top