శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా తన బ్యాటింగ్ ను ఆరంభించింది.
గాలే: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆటను టీమిండియా ప్రారంభించింది. 128/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 41 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 144 పరుగులతో ఆడుతోంది. ఈ రోజు టీమిండియా కెప్టెన్ (51) హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. అతనికి జతగా శిఖర్ ధావన్(63)తో క్రీజ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం టీమిండియా 39 పరుగులు వెనకబడి ఉంది. శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. అశ్విన్ ఆరు వికెట్లతో తొలి రోజు ఆకట్టుకున్నాడు.