రన్నరప్గానే సరిపెట్టుకున్నాడు.. | sameer verma defeated in hong kong open final round | Sakshi
Sakshi News home page

రన్నరప్గానే సరిపెట్టుకున్నాడు..

Nov 27 2016 2:54 PM | Updated on Sep 2 2018 3:17 PM

రన్నరప్గానే సరిపెట్టుకున్నాడు.. - Sakshi

రన్నరప్గానే సరిపెట్టుకున్నాడు..

తన కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది.

కౌలూన్: తన కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ సాధించాలనుకున్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో సమీర్ వర్మ 14-21, 21-10, 11-21 తేడాతో ఎన్జీ కా లాంగ్(హాంకాంగ్)చేతిలో ఓటమి పాలయ్యాడు. 

 

తొలి గేమ్ను కోల్పోయిన సమీర్.. ఆ తరువాత రెండో గేమ్ను సునాయాసంగా గెలిచాడు. కాగా, నిర్ణయాత్మక మూడో గేమ్లో సమీర్ మరోసారి తడబడ్డాడు. ప్రత్యర్థి లాంగ్కు ఎత్తులకు తలవంచిన సమీర్ ఆ గేమ్ను చేజార్చుకున్నాడు. మూడో గేమ్లో కనీసం పోరాడకుండానే సమీర్ చేతులెత్తేశాడు. దాంతో రన్నరప్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పివి సింధు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement