అపరిచిత మహిళకు షమీ మెసేజ్‌

Mohammed Shami Sends Message to an Unknown Lady on Instagram - Sakshi

న్యూఢిల్లీ : ఆఫ్‌ఫీల్డ్‌ కారణాలతో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే అతని భార్య హసీన్‌ జహాన్‌ షమీ స్త్రీలోలుడని, చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, అదనపు కట్నం కోసం తనను తీవ్రంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో షమీపై పోలీసులు చార్జ్‌షీట్‌ కూడా నమోదు చేశారు. అతని క్రికెట్‌ కెరీర్‌ నాశనం చేసేలా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని కూడా జహాన్‌ ఆరోపించింది. ముందుగా షమీకి కాంట్రాక్ట్‌ నిరాకరించిన బీసీసీఐ.. విచారణ జరిపి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆ తర్వాత తన ఆటలో మరింత రాటుదేలిన షమీ టీమిండియా వరుస విజయాల్లో భాగమయ్యాడు. (చదవండి: షమీపై చార్జ్‌షీట్‌ నమోదు)

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రాణిస్తున్న షమీపై తాజాగా ఆ రకమైన ఆరోపణలే వ్యక్తమయ్యాయి. ఏ మాత్రం పరిచయం లేని షమీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనకు పదేపదే మెసేజ్‌లు పంపిస్తున్నాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘1.4 మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్న గొప్ప క్రికెటర్‌ నాకే ఎందుకు మెసేజ్‌ చేస్తున్నాడో ఎవరైన చెప్పగలరా?’ అని మెసేజ్‌ స్క్రీన్‌ షాట్స్‌ జత చేసి ప్రశ్నించింది. అయితే షమీ సదరు మహిళకు ‘గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌’ అని మెసేజ్‌ చేసినట్లు ఆ స్క్రీన్‌ షాట్స్‌లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అభిమానులు మాత్రం సోఫియా పోస్ట్‌పై భిన్నభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు షమీ చేసిన మెసేజ్‌లో తప్పేం ఉందని ప్రశ్నిస్తూ మద్దుతుగా నిలుస్తుండగా.. మరికొందరు అతను నిజంగా స్త్రీలోలుడేనని తప్పుబడుతున్నారు. ఒంటరిగా ఉండలేక మెసేజ్‌ చేసినట్లున్నాడని మరికొందరు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి : ‘ముస్లిం కాబట్టే షమీని పక్కన పెట్టారు’)

ఇక ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన షమీ 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించి ఔరా అనిపించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఓడినప్పటికి షమీ 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. పాకిస్తాన్‌ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ గాయపడటంతో తుది జట్టులోకి వచ్చిన షమీ.. తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గాయం నుంచి భువీ కోలుకోవడంతో శ్రీలంకతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే కీలక సెమీఫైనల్‌ మ్యాచ్‌కు షమీని పక్కన బెట్టడంపై మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. (చదవండి: ఇదేంటి.. జట్టులో షమీ లేడు? )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

10-07-2019
Jul 10, 2019, 03:30 IST
ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డు పడ్డాడు. భారత్, న్యూజిలాండ్‌ మధ్య పోరులో ఒక ఇన్నింగ్సూ...
09-07-2019
Jul 09, 2019, 23:33 IST
రిజర్వ్‌డే రోజు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటే లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లతో ఉన్న కోహ్లిసేన ఫైనల్‌ చేరుకుంటుంది.
09-07-2019
Jul 09, 2019, 23:15 IST
మాంచెస్టర్‌:  ఉహించిందే జరిగింది. ప్రపంచకప్‌ తొలి సెమీస్‌కు వరణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్‌డే (బుధవారం)కు వాయిదా వేశారు. ప్రస్తుతం 46.1...
09-07-2019
Jul 09, 2019, 20:57 IST
హైదరాబాద్‌ : ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌-2019లో తన ఫేవరేట్‌ జట్టు టీమిండియానేనని పాకిస్తాన్‌ వెటరన్‌ కీపర్‌ కమ్రాన్‌ ఆక్మల్‌...
09-07-2019
Jul 09, 2019, 20:43 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది....
09-07-2019
Jul 09, 2019, 19:43 IST
మాంచెస్టర్ ‌: ప్రపంచకప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తొలి ఓవర్‌ తొలి బంతికే రివ్యూకు వెళ్లి...
09-07-2019
Jul 09, 2019, 18:50 IST
నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు​.. ప్రస్తుత ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ రికార్డు. అందులో ఒక హ్యాట్రిక్‌.
09-07-2019
Jul 09, 2019, 17:55 IST
మాంచెస్టర్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన...
09-07-2019
Jul 09, 2019, 16:20 IST
మాంచెస్టర్‌:  న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్‌కప్‌లో విలియమ్సన్‌ ఐదు వందల...
09-07-2019
Jul 09, 2019, 14:45 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమిండియా తమ అంచనాలను నిజం చేస్తూ సెమీ ఫైనల్‌...
09-07-2019
Jul 09, 2019, 14:21 IST
‘అవును.. జాన్‌ సెనా ఇండియా కచ్చితంగా గెలుస్తుంద’ని మరొకరు కామెంట్‌ చేశారు.
09-07-2019
Jul 09, 2019, 12:21 IST
దినేశ్‌ కార్తీక్‌ కంటే జాదవ్‌ను తీసుకోవడమే ఉత్తమమని
09-07-2019
Jul 09, 2019, 11:43 IST
మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో గత మ్యాచ్‌ తాలూకు పరాజయాలు నాకౌట్‌లో తమ జట్టును ప్రభావితం చేయలేవని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌...
09-07-2019
Jul 09, 2019, 11:17 IST
భారత్‌ ఫామ్‌ చూస్తుంటే ఆ జట్టు కసి తెలుస్తోంది. నమ్మశక్యం కానీ ప్రదర్శనను
09-07-2019
Jul 09, 2019, 10:33 IST
ఓ వైడ్‌ బంతితో కోహ్లి కివీస్ సారథి విలియమ్సన్‌ను బోల్తా కొట్టించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది..
09-07-2019
Jul 09, 2019, 09:35 IST
ప్రపంచకప్‌లో భారీ స్కోర్లు సాధించలేదనే బెంగ నాకు లేదు..  రోహిత్‌ మరో రెండు సెంచరీలు కూడా సాధిస్తాడు..
09-07-2019
Jul 09, 2019, 08:43 IST
బౌల్ట్‌ బౌలింగ్‌లో రోహిత్‌ రికార్డు గొప్పగా లేకపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయం.
09-07-2019
Jul 09, 2019, 08:18 IST
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచకప్‌లోకి భారత జట్టు సెమీ ఫైనల్స్‌కు ప్రవేశించడంతో క్రికెట్‌ అభిమానుల్లోనే కాదు.. బెట్టింగ్‌రాయుళ్లల్లోనూ జోష్‌ పెంచింది. ఈ...
09-07-2019
Jul 09, 2019, 07:21 IST
సిటీలో క్రికెట్‌ ఫీవర్‌ పీక్‌స్థాయికి చేరింది. నేడు ఇండియా–న్యూజిలాండ్‌ జట్ల సెమీఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఫెక్సీలు..బ్యానర్లు..ప్రత్యేక...
09-07-2019
Jul 09, 2019, 04:51 IST
‘భారత్‌ సెమీఫైనల్‌ ప్రత్యర్థి న్యూజిలాండ్‌’ శనివారం అర్ధరాత్రి దాటాక ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ ఫలితం వచ్చాక సగటు టీమిండియా అభిమానిని...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top