
భార్య ఫోటో పెట్టాడని క్రికెటర్ పై దూషణలు
భారత వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్కు చేదు అనుభవం ఎదురైంది.
బరోడా:భారత వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్కు చేదు అనుభవం ఎదురైంది. తన భార్య సఫా బేగ్ ఫోటోను ఫేస్బుక్ లో పోస్ట్ చేసి విమర్శలకు గురయ్యాడు. కోన్ని రోజుల క్రితం ఇర్ఫాన్ పఠాన్ తన భార్య ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అందులో సగం ముఖం కనిపించేలా ఉన్న సఫా బేగ్ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకునే యత్నం చేశాడు. మరొకవైపు 'దిస్ గర్ల్ ఈజ్ ట్రబుల్' అనే క్యాప్షన్ ను జోడించాడు. ఇంకే ముంది నెటిజన్లు రెచ్చిపోయారు. 'ఇర్ఫాన్ నీవు చేసిన పని సరికాదు అంటూ దూషణలకు దిగారు. ఇలా భార్యల ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని కొందరు విమర్శలు గుప్పించగా, ఆ క్యాప్షన్ ను మరికొంతమంది తీవ్రంగా తప్పుబట్టారు. పలువురు ఇర్పాన్ కు మద్దతుగా నిలిచారు.