ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ హృతిక్ రోషన్ తన నృత్యంతో ఆకట్టుకోనున్నాడు.
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో బాలీవుడ్ మెరుపులు
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎనిమిదో సీజన్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ హృతిక్ రోషన్ తన నృత్యంతో ఆకట్టుకోనున్నాడు. ఈనెల 7న కోల్‌కతాలో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఈ ఈవెంట్‌కు నటుడు సైఫ్ అలీ ఖాన్ యాంకర్ పాత్ర పోషిస్తాడు. ఇక హృతిక్‌తో పాటు నటి అనుష్క శర్మ, షాహిద్ కపూర్, డెరైక్టర్.. సింగర్ ఫర్హాన్ అక్తర్, సంగీత దర్శకుడు ప్రీతం తమ ప్రావీణ్యంతో ఆహుతులను ఆకట్టుకోనున్నారు.
ఎంసీసీ క్రికెట్ ఆఫ్ ప్లెడ్జ్ తీసుకునేందుకు మొత్తం ఎనిమిది జట్ల కెప్టెన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. డిఫెండింగ్ చాంప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ ఐపీఎల్ ట్రోఫీని తిరిగి స్టేడియంలోకి తీసుకొని రావడంతో తాజా సీజన్ ఆరంభమైనట్టవుతుంది. రాత్రి 7.30 గంటల నుంచి రెండు గంటలపాటు వేడుకలు సాగుతాయి. ఈ వేడుకలను సోనీ సిక్స్ చానల్ ప్రత్యక్షప్రసారం చేస్తుంది.