
రణ్‌వీర్ సింగ్ అనగానే మనందరికీ అంతులేని ఎనర్జీ, విభిన్న వేషధారణ.. ఇవన్నీ గుర్తొస్తాయి. స్క్రీన్ మీద, మీడియా ముందు కనపడే సమయాల్లో రణ్‌వీర్ సింగ్ ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. అభిమానులను తరచూ కలుస్తూ వారిని సప్రైజ్ చేస్తుంటారు. అలా అభిమానులను కలిసిన రణ్‌వీర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియో ఏముందంటే.. లండన్‌లో ఉన్న రణ్‌వీర్ తన అభిమానులను కలిసేందుకు యూకేలోని సౌత్‌హాల్‌కు వెళ్లాడు. అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అభిమానులంతా అతన్ని చూసేందుకు.. అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. అయితే వారందరినీ కాదని రణ్‌వీర్ ఒక పెద్దావిడ దగ్గరకు వెళ్లాడు. తనను చూసేందుకు వీల్‌చైర్‌లో వచ్చిన ఆ పెద్దావిడ ముందు మోకాళ్లపై నిలబడి ప్రేమతో పలకరించాడు. తన దగ్గర ఉన్న రోజా పువ్వును పెద్దావిడకు ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడాదు. ఆ పెద్దావిడ రణ్‌వీర్‌ను ఆప్యాయంగా ముద్దాడింది. రణ్‌వీర్ కూడా పెద్దవిడ చేతులపై ముద్దు పెట్టి ప్రేమతో నవ్వుతూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అంత మంది అభిమానుల మధ్య వీల్‌చైర్‌లో ఉన్న పెద్దావిడను గుర్తించి వెళ్లి పకరించడం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.‘ రణ్‌వీర్ ఓ జెంటిల్‌మెన్... ప్రతి ఒక్కరిని ఆయన గౌరవిస్తారు’ , ‘ రణ్‌వీర్ ఓ గొప్ప వ్యక్తి’ , ‘ ఇతనిలా అందరూ ప్రేమగా ఉండేలా చేయి దేవుడా’ అంటూ నెటిజన్లు రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
🎥 | Ranveer Singh Spotted with some lucky fans in London 💗
— RanveerSingh TBT | #83🏏♥️ (@RanveerSinghtbt) August 3, 2019
_
Him with Elders ! 😭💗💗 pic.twitter.com/xFIaoD0hkS
కాగా రణ్‌వీర్ ప్రస్తుతం ‘83’ చిత్రంలో నటిస్తున్నారు. 1983 నాటి క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్ అప్పటి జట్టుకు సారథ్యం వ్యవహరించిన కపిల్‌దేవ్ పాత్రలో కనిపించబోతున్నారు. అప్పట్లో క్రికెట్ బృందం మొత్తం ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందో వెండితెరపై ఇప్పుడూ అటువంటి పెర్ఫార్మెన్సే ఇచ్చేందుకు ఈ చిత్రబృందం పూర్తిస్థాయిలో శ్రమిస్తుంది.