‘లోకేశ్‌ ఆ వ్యాధికి లోనయ్యారు’ | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ ఆ వ్యాధికి లోనయ్యారు: విజయసాయిరెడ్డి

Published Mon, Jul 22 2019 1:16 PM

Vijaya Sai Reddy Slams Nara Lokesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌ చేస్తున్న అసత్య ప్రచారంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు అభిజ్ఞా పక్షపాతంతో(కాగ్నిటివ్ బయాస్) ఉంటారని సైకాలజీ చెబుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దీనిని డన్నింగ్‌ క్రూగర్‌ ఎఫెక్ట్‌ అని పిలుస్తారని.. లోకేశ్‌కు కూడా ఇదే సమస్య ఉందని చెప్పారు. లోకేశ్‌ తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం.. ఒక్కడే సంతానం కావడం వల్ల ఆయన ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ సాయంపై టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. అమరావతి ఒక స్కామ్‌ల పుట్ట అని గుర్తించే.. వరల్డ్‌ బ్యాంకు రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసిందన్నారు. రియల్‌ ఎస్టేట్‌కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కి.మీ రోడ్డుకు రూ. 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అది పెద్ద కుంభకోణంగా బ్యాంక్‌ దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. 

Advertisement
Advertisement