అవును.. పొరపాటే! | yes that is Mistake says priynka gandhi | Sakshi
Sakshi News home page

అవును.. పొరపాటే!

May 20 2014 1:48 AM | Updated on Sep 2 2017 7:34 AM

‘డెరైక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్)’ కోసం ఒకటికి మించిన దరఖాస్తులు సంబంధిత శాఖకు సమర్పించినట్లు ప్రియాంక గాంధీ వాద్రా అంగీకరించారని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి నవీద్ మసూద్ వెల్లడించారు.

బహుళ ‘డిన్’లు ఉండటంపై ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ‘డెరైక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్)’ కోసం ఒకటికి మించిన దరఖాస్తులు సంబంధిత శాఖకు సమర్పించినట్లు ప్రియాంక గాంధీ వాద్రా అంగీకరించారని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి నవీద్ మసూద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి లేఖ రాశారు. అయితే, అది కావాలని చేసింది కాదని, అనుకోకుండా జరిగిన పొరపాటని వివరించినట్లు మసూద్ తెలిపారు. అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తినీ వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ప్రియాంక, కార్తిలకు ఒకటికి మించిన డిన్’లు ఉన్నాయని, అది కంపెనీల చట్టం కింద నేరమని స్వామి చేసిన ఫిర్యాదుపై మసూద్ స్పందించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement