breaking news
Director Identification Number
-
కంపెనీల ఏర్పాటు మరింత సులువు
న్యూఢిల్లీ: కంపెనీ ఏర్పాటు చేయడం ఇక మరింత సులువు కానున్నది. డెరైక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్) కేటాయింపు, కంపెనీ ఏర్పాటు, ప్రతిపాదిత కంపెనీకు సంబంధించి డెరైక్టర్ల నియామకం తదితర వివరాలను గతంలో ఐదు ఎలక్ట్రానిక్ దరఖాస్తుల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వివరాలన్నింటిని ఒక్క ఎలక్ట్రానిక్ దరఖాస్తు - ఐఎన్సీ29 ద్వారా సమర్పిస్తే సరిపోతుందని కంపెనీ మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. భారత్లో వ్యాపారం నిర్వహించడం సులువు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా కొత్త కంపెనీల చట్టంలో వివిధ మార్పులు చేయాలని కూడా కంపెనీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. -
అవును.. పొరపాటే!
బహుళ ‘డిన్’లు ఉండటంపై ప్రియాంక గాంధీ న్యూఢిల్లీ: ‘డెరైక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్(డిన్)’ కోసం ఒకటికి మించిన దరఖాస్తులు సంబంధిత శాఖకు సమర్పించినట్లు ప్రియాంక గాంధీ వాద్రా అంగీకరించారని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి నవీద్ మసూద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి లేఖ రాశారు. అయితే, అది కావాలని చేసింది కాదని, అనుకోకుండా జరిగిన పొరపాటని వివరించినట్లు మసూద్ తెలిపారు. అవే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తినీ వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ప్రియాంక, కార్తిలకు ఒకటికి మించిన డిన్’లు ఉన్నాయని, అది కంపెనీల చట్టం కింద నేరమని స్వామి చేసిన ఫిర్యాదుపై మసూద్ స్పందించారు.