మంత్రి పాదాలు తాకిన మహిళా అధికారి..

Woman Officer Touches MP Ministers Feet - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మంత్రి పాదాలను ఓ మహిళా అధి​కారి తాకిన వీడియో వైరల్‌ కావడంతో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్ర ప్రజా పనుల మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ దెవాస్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఓ మహిళా అధికారి ఆయన పాదాలకు నమస్కరించడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజేష్‌ లునావత్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నూతన మధ్యప్రదేశ్‌ ఇదే..అధికార యంత్రాంగం మంత్రి పాదాక్రాంతమైంద’ ని ఆయన ట్వీట్‌ చేయడం కలకలం రేపింది. గురునానక్‌ 550వ జయంతి వేడుకల సందర్భంగా దెవాస్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన‍్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారలో ప్రార్ధనలు చేసేందుకు మంత్రి చేరుకోగా అక్కడే ఉన్న మహిళా అధికారి ఆయన పాదాలను తాకారు. మహిళా అధికారి దెవాస్‌ మున్సిపల్‌ కమీషనర్‌గా భావిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top