
న్యూఢిల్లీ: లడక్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్-చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలో కల్నల్ సహ 20 మంది సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దులో తాజా పరిస్థితులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(జూన్ 19) సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. (సరిహద్దు ఘర్షణ : రాజ్‌నాథ్ మళ్లీ కీలక భేటీ)
In order to discuss the situation in the India-China border areas, Prime Minister @narendramodi has called for an all-party meeting at 5 PM on 19th June. Presidents of various political parties would take part in this virtual meeting.
— PMO India (@PMOIndia) June 17, 2020
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన పోరాటంలో 45 మంది చైనా సైనికులు మరణించడం లేదా గాయపడి ఉండవచ్చని సమాచారం. ఇరుదేశాల సైనికులు పరస్పరం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది.