స్నేహమంటే ఇదేరా.. | Heartwarming Video: Baby Monkey Rides On Street Dog | Sakshi
Sakshi News home page

వైరల్‌: కుక్కపై పిల్లకోతి స్వారీ

Feb 17 2020 2:19 PM | Updated on Feb 17 2020 3:51 PM

Heartwarming Video: Baby Monkey Rides On Street Dog - Sakshi

‘స్నేహాని కన్న మిన్న.. లోకాన లేదురా..’ అని ఏ సినీ కవి పాటందుకున్నాడో కానీ ఆ మాటను అక్షరాలా నిజం చేసి చూపించాయూ జంతువులు. కనిపిస్తే చాలు కొట్టుకునేంత పనిచేసే కుక్క, కోతి కలిసిమెలసి తిరగడం అందరినీ కాస్త ఆశ్చర్యానికి లోను చేసింది. వైరాన్ని పక్కనపెట్టి దోస్తానా చేసి ఔరా అనిపించాయి. ఇక బ్రెడ్డు ముక్క చేతపట్టుకున్న కోతిపిల్ల హాయిగా తల్లిని అదిమి పట్టుకున్నట్టుగా కుక్క మీద కూర్చొని దాన్ని గట్టిగా పట్టుకుంది. అది ఎటు వెళ్తే అటు తిరగడం ప్రారంభించింది. ఏమనిపించిందో ఏమో కానీ కుక్కపై స్వారీ చేసిన ఈ కోతి కాసేపటికి కిందకు దిగింది. (చాలా సంతోషం: నన్ను గుర్తుపట్టింది)

అప్పుడు ఆ శునకం కాస్త పక్కకు వెళ్లింది. దీంతో వెంటనే వానరం ఏదో ఉపద్రవం వచ్చినట్టుగా పరుగెత్తుకుంటూ వెళ్లి దాన్ని అందుకుంది. కుక్క వెనకాలే నడుస్తూ దాని స్నేహాన్ని చాటుకుంది. మహేశ్‌ నాయక్‌ అనే వ్యక్తి ఈ అపురూపమైన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘ఆప్యాయత అందరికీ అర్థమయ్యే భాష’ అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఇక ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటే ఇలా ఉండాలి’, ‘అమ్మ కొంగు విడవని చంటి బిడ్డలా శునకాన్ని వదిలి క్షణమైనా ఉండటం లేదీ కోతిపిల్ల’ అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.('వీరి ప్రేమ ముందు ఏ వైరస్‌ నిలబడలేదు')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement