మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు | Four Army Personnel Killed In Pulwama Encounter | Sakshi
Sakshi News home page

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌; మేజర్‌ సహా ముగ్గురు జవాన్ల మృతి

Feb 18 2019 8:42 AM | Updated on Feb 20 2019 9:24 AM

Four Army Personnel Killed In Pulwama Encounter - Sakshi

పుల్వామాలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌ : ఉగ్రదాడితో ఆందోళనకరంగా మారిన దక్షిణ కశ్మీర్‌లో ఆందోళన పరిస్థితులు నెల​​​కొన్నాయి. 43 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని పింగ్లన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో వారిని మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. వీరంతా 55 రాష్ట్రీయ రైఫిల్స్‌ దళానికి చెందిన వారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఇప్పటికే పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిని ఢీ​​కొట్టి 43 మంది జవాన్ల మృతికి కారణమైన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు రోజుకో రకంగా దాడులు కొనసాగిస్తున్నారు. శనివారం రాజౌరీ జిల్లాలో వారు అమర్చిన ల్యాండ్‌మైన్‌ నిర్వీర్యం చేసే క్రమంలో ఆర్మీ అధికారి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు మృతి చెందడంతో యావత్‌ భారతావని ఆగ్రహంతో రగిలిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement