కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను ఆత్మహత్య

CRPF Jawan Aravind Commits Suicide In Kashmir - Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఆర్పీఎఫ్‌ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 33 ఏళ్ల అరవింద్‌ శనివారం ఉదయం ఎవరూ లేని సమయంలో తుపాకీతో కణతపై కాల్చుకుని అత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి సంబందించి కారణం మాత్రం ఇంకా తెలిసిరాలేదు. ఈనెల 14న సెలవులను ముగించుకోని విధుల్లో చేరిన అరవింద్‌ పదిరోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

కుటుంబ, వ్యక్తిగత సమస్యల కారణంగానే జవాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2014లో సీఆర్పీఎఫ్‌లో చేరిన అరవింద్‌ ప్రస్తుతం అనంతనాగ్‌లోని సర్ధార్‌ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మృతదేహాన్ని ఆయన స్వగృహానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top