Hero Sudheer Babu Bottle Cap Challenge Video With Badminton Rocket - Sakshi
Sakshi News home page

రాకెట్‌తో బాటిల్‌ క్యాప్ చాలెంజ్‌

Jul 10 2019 10:43 AM | Updated on Jul 10 2019 11:07 AM

Sudheep Babu Bottle Cap Challenge Video - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాటిల్ క్యాప్ చాలెంజ్‌ ఫీవర్ నడుస్తోంది. హిందీ, తెలుగు సినీ రంగాలకు చెందిన ప్రముఖులు అక్షయ్‌ కుమార్‌ ప్రారంభించిన బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌లో భాగంగా వీడియోలను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తున్నారు. వీరితో పాటు క్రీడారంగంలోని వారు కూడా ఈ చాలెంజ్‌లో భాగస్వాములౌతున్నారు.

తాజాగా టాలీవుడ్‌ యంగ్ హీరో సుధీర్‌ బాబు విభిన్నంగా బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. ముందుగా అక్షయ్‌ లాగే కాలితో బాటిల్‌ క్యాప్స్‌ ఓపెన్‌ చేసిన సుధీర్‌ బాబు, తరువాత బ్యాడ్మింటన్‌ ఆడుతూ బాటిల్‌ క్యాప్‌ను ఓపెన్‌ చేశాడు. ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సైతం క్రికెట్ ఆడుతూ బాటిల్‌ క్యాప్‌ను ఓపెన్‌ చేసిన విషయం తెలిసిందే.
(చదవండి : వైరల్‌: యువీ నువ్వు కేక!)


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement