సోదరులతో కలసి నిర్మాతగా మారనున్న సోనాక్షి | Sonakshi Sinha to make movies with brothers | Sakshi
Sakshi News home page

సోదరులతో కలసి నిర్మాతగా మారనున్న సోనాక్షి

Oct 21 2014 4:01 PM | Updated on Apr 3 2019 6:23 PM

సోదరులతో కలసి నిర్మాతగా మారనున్న సోనాక్షి - Sakshi

సోదరులతో కలసి నిర్మాతగా మారనున్న సోనాక్షి

బాలీవుడ్ యువనటి సోనాక్షి సిన్హా సినీ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు.

ముంబై: బాలీవుడ్ యువనటి సోనాక్షి సిన్హా సినీ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు. సోదరులతో కలసి సినిమాలు నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు. సోనాక్షి తన కవల సోదరులు లవ్, కుశ్లతో కలసి సినిమాలు తీయనున్నారు.

క్రటోస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో తాను, సోనాక్షి, లవ్ కలసి సినిమాలు నిర్మించనున్నట్టు కుశ్ ట్వీట్ చేశారు. తన కుటుంబంతో కలసి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సినీ నిర్మాణంలో భాగస్వామిని అవుతానని సోనాక్షి ఇంతకుముందు ప్రకటించారు. వీరు ముగ్గరూ బాలీవుడ్ వెటరన్, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా వారసులు.

Advertisement
 
Advertisement
Advertisement