రెండు కోణాలున్న పాత్ర ఇది : సిద్ధార్థ్ | Siddharth Nalo Okkadu Audio Released | Sakshi
Sakshi News home page

రెండు కోణాలున్న పాత్ర ఇది : సిద్ధార్థ్

Apr 16 2015 10:23 PM | Updated on Sep 3 2017 12:23 AM

రెండు కోణాలున్న పాత్ర ఇది : సిద్ధార్థ్

రెండు కోణాలున్న పాత్ర ఇది : సిద్ధార్థ్

ఇప్పటివరకు నేను పాతిక చిత్రాలు చేస్తే, వాటిలో పన్నెండు తెలుగు సినిమాలున్నాయి. ఆ విధంగా తెలుగు పరిశ్రమతో

 ‘‘ఇప్పటివరకు నేను పాతిక చిత్రాలు చేస్తే, వాటిలో పన్నెండు తెలుగు సినిమాలున్నాయి. ఆ విధంగా తెలుగు పరిశ్రమతో నాది విడదీయరాని అనుబంధం. వచ్చే ఏడాది తెలుగులో రెండు చిత్రాలు చేయనున్నా. ‘నాలో ఒక్కడు’ సినిమా ఒక వినూత్న ప్రయత్నం. ఇందులో రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తా’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. ప్రసాద్ రామర్ దర్శకత్వంలో ఆయన నటించిన తమిళ చిత్రం ‘ఎనక్కుళ్ ఒరువన్’ తెలుగులో ‘నాలో ఒక్కడు’ పేరిట అనువాదమైంది. కోనేరు కల్పన సారథ్యంలో ఈ చిత్రాన్ని ప్రకృతి విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నాని ఆవిష్కరించి, సందీప్‌కిషన్‌కి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని సి. కల్యాణ్ విడుదల చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement