ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టగలరా?

Shaheen Bhatt Shared Her Sister Alia Bhatt Childhood Picture - Sakshi

ఇప్పుడు తనో స్టార్‌.. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లోనూ నటించి తన సత్తా చాటుకుంది. బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్‌డమ్‌ను సృష్టించుకున్న నటి ప్రస్తుతం ఓ దక్షిణాది సినిమాలోనూ నటిస్తోంది. అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఆ చిత్రంలో ఈ హీరోయిన్‌ ఓ ముఖ్య పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఆ నటికి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న క్యూట్‌ లిటిల్‌ గర్ల్‌ ఎవరో ఇంకా గుర్తు పట్టలేకపోతున్నారా?

క్యూట్‌గా తన అక్క ఒళ్లో కూర్చోన్న ఆ చిన్నారి అలియాభట్‌. ఆమె సోదరి షహీన్‌ భట్‌ తన చెల్లెల్ని ఎత్తుకుని ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. మహేస్‌ భట్‌ ముద్దుల తనయ అలియా భట్‌.. బాలీవుడ్‌లో స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రాజీ చిత్రంతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ క్యూట్‌ గర్ల్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన సీత పాత్రలో నటించనుంది. ఇక మహేష్‌ భట్‌ దర్శకత్వంలో రాబోతోన్న సడక్‌-2 చిత్రంలోనూ నటించనుండటంతో.. ఆ ఫ్యామిలీకి ఇది ప్రత్యేకంగా మారనుంది. మొదటిసారి తండ్రి డైరెక్షన్‌లో కూతురు నటించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. 1991లో మహేష్‌ భట్‌ డైరెక్షన్‌లో సంజయ్‌దత్‌ హీరోగా వచ్చిన సడక్‌ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా సడక్‌-2ను రూపొందించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top