
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా షూటింగ్ లోకేషన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షూటింగ్ లొకేషన్‌లో బస్ నుంచి దిగిన తారక్, చరణ్ తో కలిసి స్కూటర్ మీద వెళ్తున్న వీడియోనూ చరణ్, తారక్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్, హాలీవుడ్ తార డైసీ ఎడ్గర్ జోన్స్‌లు అలరించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.