సోలోగా వస్తోన్న కేశవ..? | no competition for nikhil | Sakshi
Sakshi News home page

సోలోగా వస్తోన్న కేశవ..?

May 12 2017 3:12 PM | Updated on Aug 29 2018 5:43 PM

సోలోగా వస్తోన్న కేశవ..? - Sakshi

సోలోగా వస్తోన్న కేశవ..?

డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్, త్వరలో కేశవగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ

డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్, త్వరలో కేశవగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లింగ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా స్వామి రారా కాంబినేషన్ రిపీట్ అవుతుండటం.. నిఖిల్ లుక్, ప్రమోషన్ సూపర్బ్గా ఉండటంతో కేశవపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా కేశవకే ఫేవర్ చేసేలా ఉంది.

మే 19న కేశవ రిలీజ్ అవుతోంది. అయితే ముందుగా అదే రోజు నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం, గోపిచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. నాగచైతన్య సినిమా వారం వెనక్కి పోవటం నిఖిల్కు ప్లస్ అయ్యింది. అంతేకాదు ఆరడుగుల బుల్లెట్ను కూడా రెండు మూడు వారాలు వాయిదా వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నిఖిల్ కేశవకు పోటి లేకుండా పోతుంది. సోలోగా వారం పాటు థియేటర్లలో సత్తా చూపించే చాన్స్ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement