షారుక్పై కేసు విచారణ నేడు | Mumbai High court to hear case against Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

షారుక్పై కేసు విచారణ నేడు

Oct 12 2013 1:40 PM | Updated on Jul 23 2018 9:11 PM

షారుక్పై కేసు విచారణ నేడు - Sakshi

షారుక్పై కేసు విచారణ నేడు

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్పై నమోదైన ముందస్తు లింగనిర్ధారణ కేసును ముంబై హైకోర్టు శనివారం విచారించనుంది.

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్పై నమోదైన ముందస్తు లింగనిర్ధారణ కేసును ముంబై హైకోర్టు శనివారం విచారించనుంది. షారుక్, గౌరీ ఖాన్ దంపతులకు ఇటీవల జన్మించిన అబ్రామ్ తల్లి గర్భంలో ఉన్నపుడే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఫిర్యాదు చేశారు.

షారుక్ దంపతులు సరోగసీ విధానం ద్వారా తమ కుమారునికి జన్మనిచ్చారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ పిల్లాడు జన్మించాడు. కాగా షారుక్ దంపతులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ ఆరోపణల్ని షారుక్ కొట్టిపారేశారు.

Advertisement
 
Advertisement
Advertisement