మహేష్‌-అనిల్‌ రావిపూడి మూవీ ఫిక్స్‌! | Sakshi
Sakshi News home page

మహేష్‌-అనిల్‌ రావిపూడి మూవీ ఫిక్స్‌!

Published Fri, Feb 15 2019 7:58 AM

Mahesh Babu May Act In Anil Ravipudi Direction - Sakshi

‘ఎఫ్‌2’ సినిమాతో భారీ హిట్‌ను కొట్టాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. సంక్రాంతి బరిలో భారీ చిత్రాల నడుమ రిలీజై అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సక్సెస్‌తో అనిల్‌ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌పై అందరీ దృష్టి నెలకొంది. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో అనిల్‌ రావిపూడి ఓ సినిమాను చేయబోతోన్నాడనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలుస్తోంది. మహర్షి సినిమా అనంతరం.. సుకుమార్‌తో సినిమాను చేయాల్సి ఉండగా.. స్క్రిప్ట్‌ రెడీ కావడానికి ఇంకా సమయం పడుతుందట. అయితే ఆ గ్యాప్‌లో అనిల్‌ రావిపూడితో సినిమా చేసేందేకు రెడీ అయ్యాడని సమాచారం. ఈ సినిమాలో అనిల్‌ సుంకరను నిర్మాణంలో భాగస్వామిని చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమా ఫిక్స్‌  అయినప్పటికీ.. వీటిని  చిత్రయూనిట్‌ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.  

Advertisement
Advertisement