పరిచయమైన కొత్తలో భయం ఉండేది.. | Kajal Aggarwal Experience Share Her Debut in Movies | Sakshi
Sakshi News home page

కొత్తగా ఉండాలనుకుంటున్నా!

Jan 23 2020 10:04 AM | Updated on Jan 23 2020 10:04 AM

Kajal Aggarwal Experience Share Her Debut in Movies - Sakshi

సినిమా: సీనియర్‌ హీరోయిన్లు ఇప్పుడు అవకాశాల వేటలో పడుతున్నారు. అందుకోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలాగైనా నటిగా కొనసాగాలనే వారి ఆలోచనగా మారింది. అందులో ఒకరు నటి కాజల్‌అగర్వాల్‌. ఈ బ్యూటీ సుమారు దశాబ్దన్నర నుంచి నటిస్తూనే ఉంది. వరుసగా అవకాశాలు రావడంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు కూడా దూరంగా ఉంది. అయితే ఇప్పుడు నటిగా కాస్త విశ్రాంతి వచ్చిందనే చెప్పాలి. దాన్ని కూడా కాజల్‌ ఇష్టపడడం లేదు. సినిమాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్‌ సీరీస్‌పై దృష్టి సారించింది. అలా సినిమా, వెబ్‌ సిరీస్‌ అంటూ నటించుకుంటూపోతోంది. అయినా ఇంకా సినీ అవకాశాల కోసం తప్పిస్తూనే ఉందనిపిస్తోంది. అందులో భాగంగానే నవ కథానాయకులతో జత కట్టడానికీ రెడీ అని ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. దీని గురించి సినిమా ప్రపంచం భిన్నమైందని పేర్కొంది. ఇక్కడ విజయమే ప్రధానం అని పేర్కొంది. ఇక్కడ ఇప్పుడు ఒకే ఒక్క చిత్రంతో ఉన్నత స్థాయికి చేరుకోగల పరిస్థితి అని అంది.

తాను సినిమాకు పరిచయమైన కొత్తలో పరిస్థితి వేరు అని చెప్పింది. ఒక చిత్రంలో నటించేటప్పుడు ఈ చిత్రం తనకు పేరు తెచ్చి పెడుతుందా? లేదా? అనే భయం ఉండేదని చెప్పింది. అలాంటిది ఇప్పుడు భవిష్యత్‌పై నమ్మకం పెరిగిందని అంది. అంతగా అనుభవం వచ్చిందని చెప్పింది. నటిగా చాలా ఎదిగానని, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకోవడానికి భయపడనని చెప్పింది. అందుకే ప్రయోగాత్మక పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. కథలో తన పాత్ర బాగుంటే కొత్తనటులతో జత కట్టడానికి కూడా రెడీ అని చెప్పింది. సినిమాను అంగీకరించే ముందు ఇందులో నటిస్తే తనకు లాభం ఏమిటి? మంచి జరుగుతుందా అన్న రెండు విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పింది. ఈ నూతన సంవత్సరంలో కొత్తగా ఉండాలని కోరుకుంటున్నానని అంది. అందుకే వైవిధ్యభరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పింది. మరో విషయం ఏమిటంటే తనకు ఇప్పుడే సినిమాల్లో ప్రవేశించినట్లు అనిపిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి ఇండియన్‌–2లో నటించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఈ ఏడాది తన నట జీవితం ఇంకా విజయవంతంగా ఉంటుందనే విశ్వాసాన్ని నటి కాజల్‌అగర్వాల్‌ వ్యక్తం చేసింది. మొత్తం మీద ఇప్పుడే నటించడానికి వచ్చానంటూ అవకాశాల వేటను భాగానే మొదలెట్టిందీ ముంబయి భామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement