మేలో 'ఆరడుగుల బుల్లెట్' | Gopi Chand aaradugula bullet First look | Sakshi
Sakshi News home page

మేలో 'ఆరడుగుల బుల్లెట్'

Apr 22 2017 3:53 PM | Updated on Sep 5 2017 9:26 AM

మేలో 'ఆరడుగుల బుల్లెట్'

మేలో 'ఆరడుగుల బుల్లెట్'

గోపిచంద్ హీరోగా సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆరడుగుల బుల్లెట్. చాలా కాలంగా

గోపిచంద్ హీరోగా సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆరడుగుల బుల్లెట్. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఎట్టకేలకు మేలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పలు సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ కథ అందించాడు. జయ బాలాజీ రీల్ మీడియా బ్యానర్పై తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ లుక్ పోస్టర్ను శనివారం రిలీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement