బుకింగ్స్‌లో ‘2.ఓ’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

2point0 Creates Records In Online Advance Bookings - Sakshi

ఇప్పుడు ‘2.ఓ’ ట్రెండ్‌ నడుస్తోంది. అవును.. ఎక్కడ చూసినా రజనీ-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.ఓ గురించే వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మిగిలింది బాక్సాఫీస్‌ రికార్డులను వేటాడమే. అయితే ఇప్పటికే కొన్ని రికార్డులను 2.ఓ సెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. 

అయితే ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిన మీమ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా ఈ మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే పేటీఎమ్‌ ద్వారా 1.25 మిలియన్స్‌ టికెట్స్‌ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇక బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు తెగాయని సమాచారం. ఇలా ఆన్‌లైన్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు తెగడం ‘2.ఓ’తోనే సాధ్యమైందని తలైవా అభిమానులు సంబరపడుతున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top