ప్రేమికులను కలపటానికి ప్రతిభ తోడైతే.. | Idhu Enna Maayam Love Movie Review | Sakshi
Sakshi News home page

ప్రేమికులను కలపటానికి ప్రతిభ తోడైతే..

Nov 14 2019 12:27 PM | Updated on Nov 14 2019 12:37 PM

Idhu Enna Maayam Love Movie Review - Sakshi

ఇదు ఎన్న మాయమ్‌

ప్రేమించిన వారిని కలపటానికి తమ ప్రతిభను ఉపయోగించుకోవాలను...

సినిమా : ఇదు ఎన్న మాయమ్‌ 
తారాగణం : విక్రమ్‌ ప్రభు, కీర్తి సురేష్‌, నవదీప్‌
డైరక్టర్‌ : ఏ ఎల్‌ విజయ్‌ 
భాష : తమిళం 

కథ : అరుణ్‌( విక్రమ్‌ ప్రభు) ఓ థియేటర్‌ ఆర్టిస్ట్‌. స్నేహితులతో కలిసి చిన్న చిన్న స్టేజ్‌ షోలు చేస్తూ ఉంటాడు. అయితే సరైన ప్రోత్సాహం లేక వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడు అరుణ్‌కు ఓ ఐడియా వస్తుంది. ప్రేమికులను కలపటానికి తమ ప్రతిభను ఉపయోగించుకోవాలనుకుంటాడు. యూఎమ్‌టీ అనే లవ్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తాడు. అలా చాలా మంది ప్రేమికులను కలుపుతాడు. ఓ రోజు బిజినెస్‌ మ్యాన్‌ అయిన సంతోష్‌ రెడ్డి(నవదీప్‌) తను ప్రేమించిన అమ్మాయి మాయ(కీర్తి సురేష్‌)ను దక్కించుకోవటానికి యూఎమ్‌టీ సహాయం కోరతాడు.

పెద్ద మొత్తం డబ్బు వస్తుండటంతో అరుణ్‌ మిత్రులు ఇందుకు ఒప్పుకుంటారు. అరుణ్‌ కూడా స్నేహితుల బలవంతం మేరకు ఇందుకు ఒప్పుకుంటాడు. కానీ, మాయ, సంతోష్‌లను కలపటానికి చేసే ప్రయత్నాలను అరుణ్‌ చివరి నిమిషంలో చెడగొడుతుంటాడు. వారిని కలపటానికి చేసే ప్రయత్నాలను అరుణ్‌ ఎందుకు చెడగొడుతున్నాడు? అరుణ్‌, మాయలకు మధ్య ఏదైనా ఫ్లాస్‌ బ్యాక్ ఉందా? ఉంటే ఎందుకు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు? చివరకు మాయ, అరుణ్‌లు కలుస్తారా?లేదా? అన్నదే మిగితా కథ. 

విళ్లేషణ : 2015లో విడుదలైన ఈ సినిమా ఫుల్‌ లెన్త్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీ. మదరాసుపట్టణం లాంటి హిస్టారికల్‌ లవ్‌ స్టోరీతో ప్రేమికులకు దగ్గరైన విజయ్‌ ఈ సినిమాతో మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు. విక్రమ్‌ ప్రభు, కీర్తి సురేష్‌ల నటన మనల్ని ఆకట్టుకుంటుంది. ట్విస్టులతో సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా సాగిపోతుంది. జీవీ ప్రకాశ్‌ అందించిన పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌. ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన హార్ట్‌ టచింగ్‌ లవ్‌ సినిమా ఇది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement