
మరిన్ని చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరింత చిక్కుల్లో పడ్డారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరింత చిక్కుల్లో పడ్డారు. 20 ఏళ్లుగా ఆయన ఆదాయపన్ను చెల్లించలేదంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్స్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆయన అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలు మరింత సన్నగిల్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
1995లో ఆదాయపన్ను రిటర్న్ ఇచ్చిన సమాచారం మేరకు 916 మిలియన్ డాలర్లు (రూ.6096.57 కోట్లు) నష్టపోయినట్లు వివరించారని.. అప్పట్నుంచి ఆయన పన్ను రిటర్న్ చేయకుండా ఉండేందుకు అనుమతించారని పత్రిక తెలిపింది.