జపాన్‌ ఎగువసభలో గంజాయి మొక్కలు! | Marijuana crop uncovered at offices of Japanese lawmakers | Sakshi
Sakshi News home page

జపాన్‌ ఎగువసభలో గంజాయి మొక్కలు!

Jun 23 2018 3:56 AM | Updated on Jun 23 2018 3:56 AM

Marijuana crop uncovered at offices of Japanese lawmakers - Sakshi

టోక్యో: జపాన్‌లోని ఎగువసభ భవనం ఆవరణలో గంజాయి మొక్కలు కనిపించటంతో కలకలం చెలరేగింది. గురువారం ఓ సందర్శకుడు నాలుగు గంజాయి మొక్కలను గమనించి, అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై టోక్యో మెట్రోపాలిటన్‌ గవర్నమెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎగువసభ భవనం నిర్వహణాధికారి తెలిపారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న జపాన్‌ గంజాయి వాడారన్న కారణంతో గతంలో పలువురు సుమో రెజ్లర్లను, కళాకారుల్ని, విద్యార్థుల్ని అరెస్ట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement