నువ్వే పిచ్చోడివి.. కాదు నువ్వే.. ట్రంప్‌ X కిమ్‌ | Sakshi
Sakshi News home page

నువ్వే పిచ్చోడివి.. కాదు నువ్వే.. ట్రంప్‌ X కిమ్‌

Published Fri, Sep 22 2017 5:38 PM

Kim Jong Un a "madman" : trump - Sakshi

వాషింగ్టన్‌ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య మాటల దాడి మరింత ఎక్కువయింది. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటున్నారు. ఎవరూ ఏ మాత్రం తగ్గడం లేదు. ఉత్తర కొరియాను నాశనం చేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చివాడిలా ట్రంప్‌ వ్యవహరిస్తున్నాడంటూ కిమ్‌ జాంగ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడగా.. దాని ట్రంప్‌ తాజాగా బదులిచ్చారు. కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఒక నిజమైన పిచ్చివాడని అన్నారు.

'తన దేశ ప్రజల హత్యలు, ఆకలిమంటలు పట్టని ఉత్తర కొరియాకు చెందిన కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ముమ్మాటికీ పిచ్చివాడే. ఆయన గతంలో ఎన్నడూ ఎదుర్కోని పరీక్ష ఎదుర్కొంటాడు' అంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అంతకుముంద ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి మాట్లాడిన ట్రంప్‌.. అమెరికాపై గానీ, తన మిత్రదేశాలపైగానీ దాడులు చేస్తే.. ఉత్తర కొరియాను సమూలంగా నాశనం చేస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన కిమ్‌.. డొనాల్డ్‌ ట్రంప్‌ 'మతిచెడిన' పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నారని, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దీనికే ట్రంప్‌ తాజాగా స్పందించారు.

Advertisement
Advertisement