
కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి : భాను ప్రసాద్
కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మండిపడ్డారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని వారిని హెచ్చరించారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల విమర్శలు వారి దిగజారుడు విధానాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రాజెక్టుల పనుల్లో కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లు వీళ్ల ఇళ్ల ముందు ఎక్కడ ధర్నాకు దిగుతారో అన్న ఆందోళన ఈ నాయకులకు పట్టుకుందని ఎద్దేవా చేశారు.