పరాజయం తెచ్చిన ప్యాకేజీలు!

BJP Failure In Facilitate Minimum Support Price - Sakshi

జాతిహితం 

ఉత్తరప్రదేశ్‌లో చెరకు విస్తారంగా పండించే ప్రాంతంలోని కైరానా ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన వారం రోజులకే కొత్త ప్యాకేజీ ప్రకటించారు. వ్యవసాయ అర్థశాస్త్రానికి బదులు రాజకీయాలే చెరకు లేదా చక్కెర విధానాలను శాసిస్తున్నాయి. 2014లో బీజేపీకి ఓటేసిన చెరకు రైతులే ఆగ్రహంతో ఉప ఎన్నికలో ఓడించారు. ఓటమి చవిచూసిన వెంటనే బీజేపీ హడావుడిగా మిత్రపక్షాలను దువ్వి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. చక్కెర పరిశ్రమ కోసం రూ.7,000 కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం కిందటివారం ప్రకటించడం కూడా ఎన్నికల ప్యాకేజీల్లో భాగమే. 

ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని భయాందోళనలోకి నెట్టాయి. వర్తమాన ఘటనలకు స్పందనగా బీజేపీ సర్కారు తన కార్యాచరణను రూపొందించడం విశేషం. చక్కెర పరిశ్రమ కోసం రూ.7,000 కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం కింద టివారం ప్రకటించింది. ఈ సాయం సమస్యను పరి ష్కరిస్తుందా, కనీసం వాయిదా వేస్తుందా? అంటే జవాబు లేదనే చెప్పాలి. పంచదారతో సమస్య ఏమంటే, ఇండియాలో మాదిరిగానే ప్రపంచంలోనూ దీని ఉత్పత్తి చాలా ఎక్కువ. ప్రభుత్వం ఆదేశించనట్టు చెరకు రైతులకు చక్కెర మిల్లులు కనీస మద్దతు ధర చెల్లిస్తే వాటికి ఖర్చులు కూడా గిట్టవు. రైతులకు ‘మరింత గిట్టుబాటు’ ధరలు దక్కాలని సర్కారు కోరుకుంటే ముందు చక్కెర దిగుమతులు నిషేధిం చాలి.

ప్రభుత్వం ఆ పని చేసింది కూడా. అయినా, మిల్లులకు చక్కెర ధరలు ‘గిట్టుబాటు’ కాకుంటే ప్రభుత్వం చక్కెరకు గరిష్ట చిల్లర ధర(ఎమార్పీ) నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది గత కాలపు లైసెన్స్‌– కోటా పద్ధతి అవశేషంగా కనిపిస్తుంది. 2019 లో ఓటేసే 80 శాతం ప్రజలకు ఇంతకు ముందు చెప్పిన 1960 నాటి ధర నిర్ణయ విధానంగాని, పనికిమాలిన రాజకీయాలుగాని అర్ధం కావు. దేశంలో చెరకు పండించే రైతుల సంఖ్య రోజు రోజుకు పెరుగు తోంది. అవసరానికి మించి చక్కెర ఉత్పత్తి అవు తోంది. ప్రపంచ మార్కెట్‌లో ప్రస్తుత ధరలను బట్టి చూస్తే దేశం నుంచి పంచదార ఎగుమతి చేయలేం. అయితే, చెరకు పంట వేయకుండా రైతులకు ప్రోత్సా హకాలు ఇస్తే మంచిది. ముఖ్యంగా నీటి కొరత ఉన్న మహారాష్ట్రలో రైతులకు చెరకు సాగు చెడు అలవా టుగా మారి, పర్యావరణ సంక్షోభానికి దారితీస్తున్న నేపథ్యంలో అక్కడ రైతులకు చెరకు వేయవద్దని నచ్చజెప్పాలి. రైతులు చెరకుకు బదులు పళ్ల తోటలు పెంచితే ఎంతో బాగుపడతారు. ఇలాంటి సాగు మార్పు కోసం రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే మెరు గైన  ఫలితాలు వస్తాయి. కాని, చెరకు సాగు తగ్గించి, పళ్ల తోటల పెంపకం ప్రారంభిస్తే ఎన్నికలు జరిగే 2019 మే నాటికి రైతులకు లాభాలు కనిపించవు. అందుకే చెరకు పంట విషయంలో విధానాలేవీ తక్ష ణమే మారవు. మితిమీరిన చెరకు దిగుబడి కొన సాగక తప్పదు. 

కైరానా ఉప ఎన్నిక తెచ్చిన మార్పు
ఉత్తరప్రదేశ్‌లో చెరకు విస్తారంగా పండించే ప్రాంతం లోని కైరానా ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన వారం రోజులకే కొత్త ప్యాకేజీ ప్రకటించారు. వ్యవ సాయ అర్థశాస్త్రానికి బదులు రాజకీయాలే చెరకు లేదా చక్కెర విధానాలను శాసిస్తున్నాయి. 2014లో బీజేపీకి ఓటేసిన చెరకు రైతులే ఆగ్రహంతో ఉప ఎన్నికలో ఓడించారు. తాము ఘర్షణ పడిన ముస్లిం లతో కలసి రైతులు తమను ఓడించారనే విషయం బీజేపీకి అర్థమైంది. రైతులకు వచ్చిన కోపం ముస్లిం లతో ఉన్న కలహాన్ని మర్చిపోయేలా చేసింది. అయితే, ఓటర్లను రెండు మత వర్గాలుగా చీల్చి ఉప ఎన్నికలో లబ్ధిపొందడానికి యూపీ సీఎం యోగీ ఆది త్యనాథ్‌ చేసిన చౌకబారు ఎత్తుగడ ఫలించలేదు. ఎప్పుడో మరణించిన పాకిస్తాన్‌ స్థాపకుడు జిన్నా పేరు ఉచ్చరిస్తూ హిందుల ఓట్లను రాబట్టడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 

బీజేపీ నేతలు జిన్నా పేరు చెప్పి రైతులను లొంగదీయాలని చూస్తే, ప్రతిపక్షం గన్నా(హిందీలో చెరకు) పేరుతో రైతులను ఆకట్టుకుంది. చివరికి ఓటమి చవిచూసిన వెంటనే బీజేపీ హడావుడిగా మిత్రపక్షాలను దువ్వి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. కైరానాలో ఓడిపో యిన మరుసటి రోజే పంజాబ్‌లో మిత్రపక్షమైన శిరో మణి అకాలీదళ్‌ ఎప్పటి నుంచి చేస్తున్న డిమాండ్‌ను ఆమోదించింది. అదేమంటే– సిక్కు గురుద్వారాల్లో సమూహిక భోజనాలకు (లంగర్లు) వాడే ఆహార పదార్థాలపై జీఎస్టీని కేంద్రసర్కారు రద్దు చేసింది. అలాగే, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, బీజేపీ జాతీ యాధ్యక్షుడు అమిత్‌షా మధ్య శత్రుత్వమే ఉందనే విషయం తెలిసిందే. మహారాష్ట్రలో సంకీర్ణ భాగస్వా మిని బుజ్జగించడానికి అదే వారం అమిత్‌షా, తను ఎంపికచేసిన సీఎంను వెంటపెట్టుకుని ఉద్ధవ్‌ ఇంటికి వెళ్లారు. తండ్రి బాల్‌ ఠాక్రే తెలివితేటలు పుణికి పుచ్చుకున్న ఉద్ధవ్‌ బీజేపీ నేతలకు కొత్త గుణపాఠం చెప్పారు. రాష్ట్రప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్ధవ్‌ బయటే వేచి ఉండేలా చేశారు. సీఎం ఇంతటి అవమానం ఎందుకు భరిం చాలి? 

మెజారిటీతో మరుగున పడిన సంకీర్ణధర్మం
నాలుగేళ్ల క్రితం బీజేపీకి మిత్రపక్షాలపై ఆధారపడా ల్సిన అవసరం లేకుండా పూర్తి మెజారిటీ దక్కింది. సంకీర్ణ ధర్మం పాటిస్తానని బీజేపీ చెప్పినాగాని అధికారం, జనాదరణ ఈ తరంలో ఎవరికీ లేనం తగా ప్రధానికి ఉండడంతో ఆయన ముందు మిత్ర పక్షాలన్నీ సాగిలపడ్డాయి. పరిస్థితి గమనించిన ‘వాతావరణ నిపుణుడు’ బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ లౌకిక కూటమిని వదలి అవినీతి వ్యతిరేక పంథాతో బీజేపీ శిబిరంలో చేరారు. ఇప్పుడేమో ఆయన బిహా ర్‌లో ఎన్డీఏ అంటే స్థానిక ఎన్డీఏ అనే రీతిలో మాట్లా డుతున్నారు. మగ్గురు ఎంపీలున్న చిన్న బీహార్‌ పార్టీ ఆరెలెస్వీ నేత, కేంద్ర మంత్రి అయిన ఉపేంద్ర కుశ్వాహా పట్నాలో జరిగిన ఎన్డీఏ విందుకు హాజరు కాకుండా బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు. ‘మీకు మెజారిటీ ఉన్నా మీరు బలహీనపడ్డారు. కాబట్టి మేం గట్టిగానే బేరమాడతామనే విషయం గుర్తించండి,’ అనేది ఈ మిత్రపక్షాల సందేశంగా కని పిస్తోంది. 

ఉత్తరప్రదేశ్‌లో కొద్ది నెలల క్రితం బీజేపీకి కంచుకోటలని భావించిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఓడిపోయిన ప్పుడే మోదీ సర్కారు వేగానికి మొదటి దెబ్బతగి లింది. బీజేపీని ఎన్నికల్లో ఓడించడం సాధ్యమయ్యే పనేననే సూచనలు అందరికీ కనిపించాయి. అప్పటి నుంచి బీజేపీ కంగారుతో అనేక తప్పులు చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అవినీతిపై యుద్ధం ప్రక టించిన ఈ పార్టీ కర్ణాటకలో బళ్లారి సోదరులతో చేతులు కలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే బీజేపీతో ఈ పని చేయించింది. వాస్తవానికి కర్ణాటకలో శాసనసభ ఎన్నికల నాటికి నరేంద్రమో దీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. బీజేపీకి సాధా రణ మెజారిటీ సాధించిపెట్టే స్థాయిలో మోదీకి జనా కర ్షణ శక్తి ఉంది. అయితే, బళ్లారి సోదరుల రంగ ప్రవేశంతో ఓటర్లలో అనుమానాలు రేకెత్తాయి. ఫలి తంగా, వారు తమ పలుకుబడితో 15 సీట్లు బీజేపీ ఖాతాలో పడేలా చేస్తారని అంచనావేయగా, చివరికి కమలం పార్టీకి మూడు సీట్లే లభించాయి.

 దీంతో 2019 ఎన్నికల్లో బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం కోల్పోయింది. కేంద్ర వ్యవ సాయ మంత్రిగా నియమించిన బీజేపీ నేతకు ఆ పదవి ఆయన తెలివితేటల వల్ల రాలేదు. ఫలితంగా, నాలుగేళ్లలో దేశ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు యూపీఏ పదేళ్ల అభివృద్ధితో పోల్చితే దాదాపు సగా నికి పడిపోయింది. యూపీఏ హయాంలో 3.7 వార్షిక సగటు వృద్ధిరేటు ఉన్నాగాని అప్పుడు కూడా వ్యవ సాయంలో సంక్షోభం కొనసాగింది. వ్యవసాయశాఖ కొత్త తరహా సేంద్రియ ఎరువును రైతులకు అంద జేస్తోంది. మనమంతా ‘మాత’గా పిలిచే దేశవాళీ ఆవు పేడలో మాత్రమే లభించే మంచి బాక్టీ రియా(సూక్ష్మజీవులు)తో ఈ ఎరువు రూపొందించి కేంద్ర వ్యవసాయశాఖ నామమాత్రపు ధరకు రైతు లకు సరఫరా చేస్తోంది. ఈ రకమైన వినూత్న ఎరు వులు ఉపయోగించి 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యమా? అంటే, అనుమానమే. చెరకు లేదా చక్కెర సమస్య హఠాత్తుగా ఊడిపడినది కాదు. గత నాలుగేళ్లుగా నానుతూ ఇప్పటికి ముదిరి పోయింది. ఇంతకు ముందే ఈ సమస్యను గుర్తించి, పరిష్కరించే తీరిక పాలకులకు లేకపోయింది.

రెండోది.. పెద్దగా విలువ లేని కొత్త ముఖ్యమంత్రుల నిర్లక్ష్యపూరితమైన ఎంపిక. వీరిలో ప్రతిఒక్కరూ ఇప్పుడు తమను తాము నిరూపించుకోవల్సి ఉంది. తమ తమ రాష్ట్రాలలో అన్ని స్థానాల్లోనూ ప్రజామోదాన్ని గెల్చుకున్న ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకప్పుడు పూర్తి నిర్లక్ష్యానికి గురైనవారే. ఇక మూడో అంశం ఏదంటే, పరమ అహంభావపూరిత వైఖరితో మిత్రపక్షాలతో వ్యవహరించినందుకు అది చెల్లిస్తున్న మూల్యం. ఈ తరం రాజకీయనేతలు పూర్తి మెజారిటీతో పాలన సాగించే అనుభవాన్ని కోల్పోయారని మనకు బాగా తెలుసు. ప్రజలు రాజకీయాల్లో ఎందుకు చేరుతున్నారనే కారణానికి సంబంధించిన వాస్తవాన్ని బీజీపే ఇప్పుడైనా నమ్రతతో అంగీకరించాలి. 

అధికార కుమ్ములాటలో తమకూ వాటా కావాలని అందరూ కోరుకుంటున్నారు. మిత్రపక్షాలకు ఎలాంటి మంత్రిపదవులనూ బీజేపీ ఇవ్వలేదు. అకాలీలు బీజేపీకి చాలా విశ్వసనీయమైన మిత్రపక్షం. ఆ పార్టీలోని పాలకకుటుంబానికి చెందిన ఒక కోడలికి మాత్రమే మంత్రివర్గంలో కేబినెట్‌ ర్యాంక్‌ కల్పించారు. అది కూడా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖను కట్టబెట్టారు. ఆమె స్వరాష్ట్రంలో ఆమెను చట్నీ, జామ్‌ మురబ్బాలు వడ్డించే మంత్రిగా పేరుపడింది. శివసైనికుడైన అనంత్‌ గీతే పోర్ట్‌ ఫోలియో మీకు తెలుసా? ఏ మిత్రపక్షానికీ తమ స్వంత విశ్వాసంతో పాలించగలిగే అవకాశం దక్కలేదు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది కానీ ఆ పార్టీ మాత్రమే పాలనా పగ్గాలను గుప్పిట్లో పెట్టుకుంది. దాని చర్యలే దాని ఫలితాలను నేడు నిర్దేశిస్తున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఈ పరిస్థితులలో పరిణిత రాజకీయ పార్టీలాగా కాకుండా శైశవదశలో మరో అతిపెద్ద విజయాన్ని సాధించడానికి అది కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top