నల్ల ఇరిక్కేన్ | Hyderabad City is very good : tamils | Sakshi
Sakshi News home page

నల్ల ఇరిక్కేన్

Aug 18 2014 12:19 AM | Updated on Sep 2 2017 12:01 PM

నల్ల ఇరిక్కేన్

నల్ల ఇరిక్కేన్

లిపిలో గజిబిజి అర్థం కాకున్నా.. ఆ తంబిల వూటల్లో వువుకారం గుండెను తాకుతుంది.

మినీ భారత్
లిపిలో గజిబిజి అర్థం కాకున్నా.. ఆ తంబిల వూటల్లో వువుకారం గుండెను తాకుతుంది. ఎల్లలు దాటిన తమిళుల భాషాభిమానం.. శతాబ్దాల కిందటే దక్కనీ భాషతో వుమేకమైంది. రాచరికపు రోజుల్లోనే తమిళుల అడుగులు రాజధాని వైపు పడ్డాయి. ఆనాడు ఒట్టి చేతులతో వచ్చిన వారు .. తమ వెంట అరవ సంస్కృతిని మోసుకొచ్చారు. ద్రవిడ సంప్రదాయూన్ని చరిత్రాత్మక నగరానికి చేర్చారు. వునలో ఒకరయ్యూరు. మేమూ.. మీవారమే అని అంటున్నారు. తాతల కాలం నుంచి బంధం పెంచుకున్న హైదరాబాద్ సిటీ నల్ల ఇరిక్కేన్(చాలా బావుంది).
 
అని తవు ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పోర్చుగీసు వారు 1565లో మొట్టమొదటిసారిగా ఇళ్లు, భూములు లేని పేద తమిళులను వేల సంఖ్యలో తీసుకుని నగరానికి వచ్చారట. సైనికులకు ఇతరత్రా పనులు చేయడానికి, గుర్రాలను మేపడానికి ఉండేవారట. ఆ తర్వాత 1600వ సంవత్సరంలో బ్రిటిష్‌వారు సైతం మరికొంత మందిని తీసుకుని వచ్చారు. బ్రిటిష్ కాలంలో వచ్చినవారు ప్రధానంగా సైనికులకు వంట చేసేవారట. నిజాం నవాబుల నుంచివందల ఎకరాల భూములను ఆ రోజుల్లోనే కొనుగోలు చేసి వీరి కోసం ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రత్యేకంగా వంటవారి కోసం ‘కుషినీ పల్‌చేరి(వంటవారి కాలనీ)’ ఏర్పాటు చేశారు. బ్రిటిష్ సైనికులతోమొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలోనూ పాల్గొన్నారు. అందుకే ఇప్పటికీ దేశంలోని కంటోన్మెంట్ ఏరియాలన్నింటిలోనూ హైదరాబాదీ తమిళులున్నారు.
 
ప్రత్యేక కాలనీల ఏర్పాటు108 బజార్, బోయిన్‌పల్లిలోని టు లైన్స్, సెంటర్

బ్యాటరీ, లాల్ బజార్, అమ్ముగూడబజార్, కౌకూర్, బాలంరాయి, కళాసిగూడ, బూసరెడ్డిగూడ, న్యూ, ఓల్డ్ మడ్‌ఫోర్డ్, దూల్‌పేట్, బొక్కల్‌కుంట, బోయిగూడ, కందిగూడ, లింగం డైరీ, వెంకటాపురం, ఆర్కే పురం, గాంధీనగర్, కార్ఖానా, నామాలగుండు, కీసరగుట్ట, నాచారం పారిశ్రామికవాడ ప్రాంతాలలో పలు కాలనీల్లో వీరు అధికంగా నివసిస్తున్నారు. బాలంరాయి, కళాసిగూడ, బూసిరెడ్డిగూడలతో పాటు పలుచోట్ల  వీరి కోసం క్వార్టర్స్ కట్టించారు.  ప్రస్తుతం సిటీలో వీరి సంఖ్య 12 లక్షలకు పైనే ఉంది.
 
రాజకీయాల్లోనూ..
 1953లో పెద్దపల్లి నుంచి ఎంపీగా ఎం.ఆర్. కృష్ణన్ గెలుపొందారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కేబినెట్‌లో హరిగరామస్వామి మంత్రిగా పనిచేశారు.
 
మాతృభాష అంటే ఎనలేని ప్రేమ
ఏడు తరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాళ్లు తెలుగు మాట్లాడితే తమిళులని గుర్తుపట్టడం కూడా కష్టం. అయితే ఇన్నేళ్లయినా వారు తమ సంప్రదాయాలను మాత్రం మర్చిపోలేదు. మడ్‌ఫోర్డ్‌లో ఇప్పటికీ తమిళ మీడియం పాఠశాల నడుస్తోంది.
 
తమిళంతో పాటు ఇంగ్లిష్
ఎంత బీదవారైనా ఇక్కడి తమిళులకు ఇంగ్లిష్ వస్తుంది. వాళ్లందరూ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలోనే చదువుతారు.

అన్ని పండుగలూ...
తెలంగాణవారి బోనాల పండుగ మాదిరే తమిళుల్లోనూ పండగ ఉంది. అయితే వారు కుండల్లో అన్నానికి బదులు నీళ్లను అమ్మవారికి సమర్పిస్తారు. తెలుగు ఉగాదిని, పీర్ల పండుగను ఘనంగా చేస్తారు. సెప్టెంబర్ 8న నిర్వహించే ‘మేరీ ఫీస్ట్’ పండుగ రోజున ఖైరతాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చికి 99 శాతం మంది తమిళులే వస్తారు. తమిళ సంవత్సరాదిని, పొంగల్ ఆడిపెరిక (ఆషాఢమాసం) తదితర పండుగలను జరుపుకుంటారు. నాగదేవత ఆలయం, పెరియమ్మ ఆలయం తదితర ఎన్నో ఆలయాలను నిర్మించుకున్నారు. ఏటా హరిహర కళాభవన్‌లో నగరంలోని తమిళులందరూ కలిసి గెట్ టుగెదర్ నిర్వహించుకుంటారు.
 
పెళ్లిళ్లు..
తమిళలు వివాహాన్ని మూడు రోజుల సంబరంగా జరుపుకుంటారు. అబ్బాయి తరఫువారు వచ్చి పిల్లనిమ్మని అడుగుతారు. వరకట్నం అస్సలు లేదు. పెళ్లి ఖర్చంతా అబ్బాయి తరఫువారే పెట్టుకుంటారు. అత్తామామలకు పెళ్లికొడుకే కాళ్లు కడుగుతాడు.
 
క్రీడా, ఉద్యోగ రంగాల్లో..
తమిళుల్లో మంచి ఫుట్‌బాల్, హాకీ క్రీడాకారులున్నారు. మొట్టమొదటిసారి భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ ఆడిన జట్టులోని ధన్‌రాజ్, డి.కన్నన్, టి.బలరాంలు హైదరాబాదీ తమిళులే.రైల్వేస్, ఎయిర్‌లైన్స్ తదితర రంగాల్లో చాలామంది ఉద్యోగులుగా పని చేస్తున్నారు. డీఆర్‌డీఓలోని మిస్సైల్స్ విభాగం డెరైక్టర్ జనరల్ వీజీ శేఖరన్ తమిళుడే!
ఇదే మా ఊరు..
తమకు హైదరాబాద్ సొంతఊరని.. నల్ల ఇరిక్కేన్ అని తమిళులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement