పోయెమ్‌ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది | Special story to auther srashta vani kola | Sakshi
Sakshi News home page

పోయెమ్‌ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది

Aug 30 2018 12:19 AM | Updated on Aug 30 2018 12:19 AM

Special story to auther srashta vani kola - Sakshi

‘విత్‌ హ్యాండ్స్‌ ఫుల్‌ ఆఫ్‌ మార్బుల్స్‌/ హెడ్‌ ఫిల్డ్‌ విత్‌ డ్రీమ్స్‌’ అనే భావ కవితాత్మక వాక్యాలున్న ‘చైల్డ్‌హుడ్‌ డ్రీమ్స్‌’ అనే కవితతో ప్రారంభమయ్యే ‘వైల్డ్‌ వింగ్స్‌’.. ఓ అచ్చ తెలుగు అమ్మాయి రచించిన ఆంగ్ల పద్య కావ్యం! ఇటీవల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన స్రష్ట వాణి కొల్లి ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నారు.

∙మొదటి కవిత ఎప్పుడు రాశారు?
స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఇచ్చిన అసైన్‌మెంట్‌కి కొత్తగా ఉంటుందని హిందీలో మొదట పద్యం రాశాను. అప్పుడు నా వయసు పదమూడు సంవత్సరాలు. ఆ తరవాత మరో అసైన్‌మెంట్‌లో వ్యవసాయ సంబంధితంగా ‘ఫార్మర్‌’ అనే పద్యం రాసి, మా ఇంగ్లిషు టీచర్‌కి చూపించాను. ఆవిడ చిన్న చిన్న మార్పులు చేయమని సూచన ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతోనే çకవిత్వం రాయడం ప్రారంభించాను.

∙చదువుకు రచన అడ్డు కాలేదా?
ఇంటర్మీడియెట్‌ చదువుతున్న రెండు సంవత్సరాలు ఒక్క పద్యం కూడా రాయలేకపోయాను. ఆ రెండేళ్లు ఏదో మిస్సింగ్‌ అనిపించింది. ఇంటర్‌లో సెంట్‌ పర్సెంట్‌తో పరీక్షలు ప్యాసయ్యాక మళ్లీ కవిత్వం రాయడం ప్రారంభించాను. ఇన్నాళ్ల విరామాన్ని మరచిపోయేలా మూడు నెలల కాలంలో దాదాపు 50 దాకా కవితలు రచించాను. అన్ని కవితలకూ మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం బీబీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్నాను.

∙కవిత్వం రాయడానికి మీకు ప్రేరణ ఎవరు?
నాకు ఖలీల్‌ జిబ్రాన్‌ రచనలంటే చాలా ఇష్టం. ఆయన నా అభిమాన రచయిత. అప్పుడప్పుడు టాగూర్‌ని చదువుతాను. షేక్‌స్పియర్‌ రచించిన హామ్లెట్‌ చదివాను. ‘మ్యాక్‌బత్‌’ నాటకంలో మ్యాక్‌బత్‌ వేషం వేయడం కోసం ఆ పాత్ర గురించి మొత్తం ^è దివాను. అర్థం కాని చోట వేరే వాళ్లను అడిగి చెప్పించుకున్నాను. 

∙మీ కవిత్వానికి ప్రేరణ ఏమిటి?
ఒక్కో పోయమ్‌ వెనకాల ఒక్కో చరిత్ర ఉంది. చిన్నప్పుడు ఎవరినైనా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే, నేను డాక్టరు, నేను ఇంజనీరు ఇలా చెబుతారు. నేను రోజుకోరకం చెప్పేదాన్ని. బాల్యం అంతా కలలు కంటూనే ఉంటాం. అలా రాసినదే ‘చైల్డ్‌ హుడ్‌ డ్రీమ్స్‌’. సీఎస్‌ లూయిస్‌ రచించిన నార్నియా అనే సిరీస్‌ చదివి బయటకు రాలేకపోయాను. దాని నుంచి ‘ఒన్‌ వింటర్‌ నైట్‌’ రాశాను. కాలేజీ నుంచి ఇంటికి వచ్చే దారిలో రకరకాల రంగురంగుల పూలు చూసేదాన్ని. వాటి నుంచి వచ్చినదే ‘ఫ్లవర్‌’. నా గదిలో కూర్చుని కిటికీలో నుంచి గదిలోకి వెలుగు రావడం చూసి, ‘లైట్‌’ పద్యం రాశాను. ప్రతి పోయెమ్‌ పక్కన వేసిన బొమ్మ నా ఆలోచనకు అనుగుణంగా చేసినదే. ‘బ్రేవ్‌’ పోయెమ్‌ నాకు నేను చెప్పుకున్నట్లుగా రాసుకున్నాను. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనుకుంటాను. 

∙ఒక్కో కవిత రాయడానికి ఎంత సమయం పడుతుంది?
మనసులోకి ఆలోచన రాగానే భావాలు రాసుకుంటాను. తరవాత దానిని ఫ్రేమ్‌ చేసుకుంటాను. మొత్తం పూర్తయ్యాక ముందుగా అమ్మకి వినిపిస్తాను. ఆవిడకు బాగున్నా బాగుండకపోయినా బాగానే ఉంది అంటుంది. నా ఐడియాని ప్రొజెక్ట్‌ చేసేది నాన్న. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాను. వీకెండ్స్‌లో చిరాకుగా అనిపిస్తే, పోయెమ్‌ రాశాక ప్రశాంతంగా అనిపిస్తుంది. కవిత్వం రాయడం నా జీవితంలో భాగంగా మారిపోయింది. 

∙మీ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏంటి?
వర్తమాన రాజకీయాల మీద వ్యాసాలు రాస్తున్నాను. లాగే కరెంట్‌ టాపిక్స్‌ మీద కూడా రాస్తున్నాను. ‘ట్రిపుల్‌ తలాక్‌’ గురించి రాసిన ఆర్టికల్‌ను ఫేస్‌బుక్‌లో ఏడువేల మంది షేర్‌ చేశారు. నేషనల్‌ సెమినార్‌లో ఆర్టికల్స్‌ ప్రజెంట్‌ చేశాను. నా తరవాతి పుస్తకం ఈ ఆర్టికల్స్‌ మీదే. 

∙మీ కుటుంబం గురించి...
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న అరవింద్‌ కొల్లి జర్నలిస్టు, అమ్మ ఆశ హౌస్‌ వైఫ్‌. ప్రస్తుతం బెంగళూరు రేవా యూనివర్సిటీలో చదువుతున్నాను. వాస్తవానికి ఇంగ్లిషు లిటరేచర్‌ చేద్దామనుకున్నాను. కాని లా డిగ్రీలో నాకు టైమ్‌ స్పేస్‌ కనిపించింది. మా యూనివర్సిటీ వారు నా పుస్తకాన్ని స్టూడెంట్స్‌ సమక్షంలో రిలీజ్‌æ చేస్తానన్నారు. భవిష్యత్తులో షార్ట్‌ స్టోరీస్, నవలలు కూడా రాయాలనుకుంటున్నాను. 
– సంభాషణ: వైజయంతి పురాణపండ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement