
కలలో భూకంపం!
‘ఇంటి కప్పు మీద పడుతుంది... వామ్మో...’’ అంటూ దిగ్గున నిద్రలో నుంచి లేస్తాం. పైన కప్పు కేసి చూస్తాం. పక్కన గోడలకేసి చూస్తాం. ‘‘హమ్మయ్య కల...
‘ఇంటి కప్పు మీద పడుతుంది... వామ్మో...’’ అంటూ దిగ్గున నిద్రలో నుంచి లేస్తాం. పైన కప్పు కేసి చూస్తాం. పక్కన గోడలకేసి చూస్తాం. ‘‘హమ్మయ్య కల... నిజంగానే భూకంపం వచ్చిందని భయపడి చచ్చాను’’ అనుకుంటాం. కలలో వచ్చే భూకంపం దేనికి సూచన?
వివిధ విశ్లేషణల ప్రకారం: మనలోని మానసిక సంక్షోభాన్ని సూచించే కల ఇది. రాబోయే ప్రమాదాన్ని ఊహిస్తూ పడే రకరకాల భయాలకు ఈ కల ప్రతీక. ఒక విషయం మీద లేదా ఒక వ్యవస్థ మీద పట్టు కోల్పోతున్నప్పుడు, కోల్పోతు న్నాననే భావనలో ఉన్నప్పుడు ఇలాంటి కల వస్తుంది.
నమ్మిన వ్యక్తుల చేతిలో మోసానికి గురైనప్పుడు, ఊహించిన విధంగా నష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఆ విషాదాన్ని ఈ కల ప్రతిబింబిస్తుంది. ఆత్మీయులు, ప్రాణప్రదంగా ప్రేమించిన వ్యక్తులు హఠాత్తుగా మరణించిన ప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. గౌరవమర్యాదలు అందుకున్నచోటే... పరాభవం ఎదురైనప్పుడు.. తన ఆరోగ్యానికి సంబంధించి భయానక, విషాద వార్త తెలిసినప్పుడు. ఆ ఆలోచనలోనే ఉన్నప్పుడు ప్రేమలో ఏడబాటు కలిగినప్పుడు కలలో భూకంపం వచ్చి భయపెడుతుంది.