ఇల్లు వదిలే ప్రశ్నే లేదు.. | Ex-ministers refuse to leave official residences | Sakshi
Sakshi News home page

ఇల్లు వదిలే ప్రశ్నే లేదు..

Published Sat, Jul 5 2014 2:38 PM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM

ఇల్లు వదిలే ప్రశ్నే లేదు.. - Sakshi

ఇల్లు వదిలే ప్రశ్నే లేదు..

ఢిల్లీలో సర్కారు మారి నెల అయిపోవస్తున్నా మాజీలు మాత్రం ఖాళీ చేయడం విషయంలో రాజీ పడటం లేదు.

.'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అన్న మాట ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులకు పూర్తిగా సరిపోతుంది. ప్రజలు తిరస్కరించారు. ఓటు పోటుతో పదవిని ఊడగొట్టారు. పదవి పోయింది. అయినా అధికార నివాస భవనాలకు అతుక్కుని ఉండటంలో మాత్రం బల్లులతో పోటీ పడుతున్నారు. 
 
ఢిల్లీలో సర్కారు మారి నెల అయిపోవస్తున్నా మాజీలు మాత్రం ఖాళీ చేయడం విషయంలో రాజీ పడటం లేదు. కొత్త మంత్రులకు నివాసాన్ని కల్పించాల్సన బాధ్యత ఉన్న అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 
 
ఇలాంటి ఘరానా కబ్జాదారులు 35 మంది ఉన్నారు. వారిలో మాజీ మంత్రులు సచిన్ పైలట్, కపిల్ సిబ్బల్, కృష్ణా తీర్థ్, మన రాష్ట్రానికి చెందిన జైపాల్ రెడ్డి, పళ్లంరాజు, గిరిజా వ్యాస్,ప్రణీత్ కౌర్, దీపా దాస్ మున్షీ, శ్రీప్రకాశ్ జైస్వాల్, బేణీ ప్రసాద్ వర్మ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరేకాక ఫారూఖ్ అబ్దుల్లా, ప్రఫుల్ పటేల్, అజీత్ సింగ్ వంటి వారూ ఉన్నారు. వీరికిచ్చిన గడువు పూర్తయినా ఇల్లును అల్లుకుపోయి వదలనంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement