తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం? | Telangana state Covering an area | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం?

May 20 2015 11:43 PM | Updated on Sep 3 2017 2:23 AM

తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం?

1.    సౌర కుటుంబంలో భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
     1) శుక్రుడు        2) అంగారకుడు
     3) సూర్యుడు     4) ఫ్రాక్సిమా సెంటావ్‌రీ
 
 2.    నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
     1) 1965    2) 1966    3) 1967    4) 1968
 
 3.    సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై 180 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఏర్పడే తరంగాలు?
     1) లఘువేలా తరంగాలు    2) పర్వ వేలా తరంగాలు
     3) తిర్యక్ తరంగాలు    4) అనుదైర్ఘ్య తరంగాలు
 
 4.    అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని పిలుస్తారు?
     1) 0 డిగ్రీల రేఖాంశం
     2) 82బీ డిగ్రీల తూర్పు రేఖాంశం
     3) 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం
     4) భూమధ్య రేఖ
 
 5.    ఐసోబార్లు అనగా...?
     1) సమాన పీడన ప్రాంతాలను కలిపే రేఖ
     2) సమాన సముద్ర లోతును కలిపే రేఖ
     3) సమాన వర్ష ప్రాంతాన్ని చూపే రేఖ
     4) సమాన సముద్ర లవణీయతను చూపే రేఖ
 
 6.    తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం?
     1) 1,14,840 చదరపు కిలోమీటర్లు
     2) 1,00, 840 చదరపు కిలోమీటర్లు
     3) 97,840 చదరపు కిలోమీటర్లు
     4) 98,010 చదరపు కిలోమీటర్లు
 
 7.    ఏ ఆవరణంలో రేడియో తరంగాలు పరావర్తనం చెందుతాయి?
     1) ట్రోపో ఆవరణం    2) స్ట్రాటో ఆవరణం
     3) మీసో ఆవరణం    4) ఐనో ఆవరణం
 
 8.    అమెజాన్ నదీ పరీవాహ ప్రాంతంలో ఉండే ఆదిమ జాతి?
     1) పిగ్మీలు        2) రెడ్ ఇండియన్‌లు
     3) మసాయీలు     4) కాబులు
 
 9.    ఆస్ట్రేలియా, న్యూగినియా దీవుల మధ్య ఉన్న జలసంధి?
     1) బాస్ జలసంధి    2) మలక్కా జలసంధి
     3) టోరస్ జలసంధి    4) జీబ్రాల్డర్ జలసంధి
 
 10.    భారత దేశ మొత్తం తీరరేఖ పొడవు ఎంత?

     1) 15,200 కి.మీ    2) 7,615.6 కి.మీ
     3) 6,200 కి.మీ    4) 7,516.6 కి.మీ
 
 11.    భారతదేశ ఉత్తర, దక్షిణ సరిహద్దుల మధ్య దూరం?
     1) 2,933 కి.మీ    2) 3,214 కి.మీ
     3) 3,412 కి.మీ    4) 4,200 కి.మీ
 
 12.    వేసవి విడిది కేంద్రమైన ముస్సోరి ఏ రాష్ట్రంలో ఉంది?
     1) ఉత్తరాంచల్    2) హిమాచల్ ప్రదేశ్
     3) పశ్చిమబెంగాల్    4) జమ్మూకాశ్మీర్
 
 13.    కుమయూన్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
     1) సింధు - సట్లెజ్    2) సింధు - జీలం
     3) సట్లెజ్ - కాళీ    4) తీస్తా - ది హాంగ్
 
 14.    తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత (చ. కిలోమీటరుకు)?
     1) 320    2) 305    3) 310    4) 285
 
 15.    భారతదేశంలో అతి ఎత్తై జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది?
     1) నర్మద    2) తపతి    3) ఇంద్రావతి    4) శరావతి
 
 16.    విస్తీర్ణం దృష్ట్యా దేశంలో అతి పెద్ద రాష్ట్రం?

     1) ఉత్తర ప్రదేశ్    2) రాజస్థాన్
     3) మధ్య ప్రదేశ్    4) మహారాష్ట్ర
 
 17.    చిలికా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
     1) పశ్చిమ బెంగాల్    2) ఒడిశా
     3) జార్ఖండ్        4) తమిళనాడు
 
 18.    కిందివాటిలో గోదావరికి ఉపనది?
     1) మూసీ   2) భీమ  3) ఘట ప్రభ    4) కిన్నెరసాని
 
 19.    బెంగాల్ దుఖఃదాయిని అని ఏ నదికి పేరు?
     1) కోసి        2) బ్రహ్మపుత్ర
     3) దామోదర్    4) గంగ
 
 20.    ఇరి - ఒన్‌టారియా సరస్సుల మధ్య ఉన్న జలపాతం?
     1) నయాగారా    2) జాంబెజి
     3) విక్టోరియా    4) ఏంజిల్
 
 21.    వేసవిలో తమిళనాడులో కురిసే సంవహన వర్షాలను ఏమని పిలుస్తారు?
     1) చెర్రీ బ్లోసమ్స్    2) కాల్ బైసాఖి
     3) మ్యాంగో షవర్స్    4) టీ షవర్స్
 
 22.    ఏ నేలలను జేగురు నేలలు అంటారు?
     1) ఎర్ర నేలలు    2) లాటరైట్ నేలలు
     3) ఒండ్రు నేలలు     4) నల్ల రేగడి
 
 23.    రూపాంతర శిలల శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు?
     1) నల్ల రేగడి నేలలు    2) ఒండ్రు నేలలు
     3) ఎడారి నేలలు    4) ఎర్ర నేలలు
 
 24.    భారతదేశంలో అత్యధికంగా అడవులు ఉన్న రాష్ట్రం?
     1) మధ్య ప్రదేశ్    2) మహారాష్ట్ర
     3) మిజోరం    4) అరుణాచల్ ప్రదేశ్
 
 25.    భారతదేశంలో మొట్ట మొదటి టైగర్ ప్రాజెక్ట్?
     1) కజిరంగ        2) కవ్వాల్
     3) జిమ్ కార్బెట్    4) మానస్
 
 26.    ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ ప్రధాన కేంద్రం?
     1) జోధ్‌పూర్    2) డె హ్రాడూన్
     3) సిమ్లా        4) భోపాల్
 
 27.    {పపంచ పర్యావరణ దినోత్సవం?
     1) జూన్ 10    2) ఏప్రిల్ 5
     3) జూన్ 15    4) జూన్ 5
 
 28.    సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగపడే రూసా గడ్డి ఏ జిల్లాలో లభిస్తుంది?
     1) ఆదిలాబాద్    2) నిజామాబాద్
     3) కరీంనగర్    4) విశాఖపట్టణం
 
 29.    సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్స్)?
     1) శ్రీనగర్        2) అమృత్‌సర్
     3) ఉదయ్ పూర్    4) జోధ్‌పూర్
 
 30.    ఇందిరాసాగర్ డ్యామ్‌ను ఏ నదిపై నిర్మించారు?
     1) నర్మద        2) మహా నది
     3) తపతి        4) గోమతి
 
 31.    భారత దేశ జాతీయ నది?
     1) గోదావరి    2) బ్రహ్మపుత్ర
     3) సింధు        4) గంగ
 
 32.    తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు కాని రాష్ట్రం?
     1) చత్తీస్‌గఢ్    2) ఒడిశా
     3) కర్ణాటక        4) మహారాష్ట్ర
 
 33.    బాబా అణు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
     1) హైదరాబాద్    2) ముంబై
     3) దిస్‌పూర్        4) తిరువనంతపురం
 
 34.    కాక్రపార అణువిద్యుత్కేంద్రం ఏ రాష్ట్రం ఉంది?
     1) కర్ణాటక        2) రాజస్థాన్
     3) గుజరాత్    4) ఉత్తరప్రదేశ్
 
 35.    మన దేశంలో మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు?
     1) పాప నాశనం    2) శివ సముద్రం
     3) విజ్జేశ్వరం    4) హీరాకుడ్
 
 36.    ఆపరేషన్ ఫ్లడ్‌కు మరో పేరు?
     1) బ్లూ రివల్యూషన్    2) వైట్ రివల్యూషన్
     3) సిల్వర్ రివల్యూషన్     4) పింక్ రివల్యూషన్
 
 37.    వరిపంటను అత్యధికంగా పండించే రాష్ట్రం?
     1) ఉత్తర ప్రదేశ్    2) పంజాబ్
     3) పశ్చిమబెంగాల్    4) హర్యానా
 
 38.    భారతదేశంలో అధికంగా జనపనార సాగయ్యే ప్రాంతం?
     1) గోదావరి ప్రాంతం    2) కావేరీ ప్రాంతం
     3) బ్రహ్మపుత్ర ప్రాంతం    4) హుగ్లీ ప్రాంతం
 
 39.    రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు?
     1) భద్రా నది    2) బ్రాహ్మణీ నది
     3) దామోదర్ నది     4) భీమ నది
 
 40.    మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా దేనికి ప్రసిద్ధి?
     1) వజ్రాలు        2) ఇల్మనైట్
     3) చైనా మట్టి    4) బాక్సైట్
 
 41.    మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
     1) కోయంబత్తూర్    2) అలహాబాద్
     3) అహ్మదాబాద్    4) లక్నో

 42.    గోల్డెన్ ఫైబర్ అంటే..?
     1) ఉన్ని    2) జనుము    3) పట్టు    4) సింథటిక్
 
 43.    భారత రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రధాన కేంద్రం?
     1) ఎలహంక    2) వారణాసి
     3) పాటియాలా    4) కపుర్తలా
 
 44.    పశ్చిమ తీరంలోని ఓడరేవు?
     1) ట్యుటికోరిన్    2) పారాదీప్
     3) ఎన్నోర్        4) నవసేవ
 
 45.    తెలంగాణలో ప్రవహించని నది?
     1) దిండి    2) బాహుదా       3) గోదావరి        4) కృష్ణ
 
 
 సమాధానాలు
 1) 3    2) 3    3) 2    4) 3    5) 1
 6) 1    7) 4    8) 2    9) 3    10) 4
 11) 2    12) 1    13) 3    14) 3    15) 4
 16) 2    17) 2    18) 4    19) 3    20) 1
 21) 3    22) 2    23) 4    24) 1    25) 3
 26) 2    27) 4    28) 2    29) 3    30) 1
 31) 4    32) 2    33) 2    34) 3    35) 2
 36) 2    37) 3    38) 4    39) 2    40) 1
 41) 3    42) 2    43) 4    44) 4    45) 2

 
 ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
 ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఉన్న ఐడీబీఐ శాఖలు, కార్యాలయాల్లో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. నియామాకాలు పూర్తిగా ఒప్పంద పద్ధతి (కాంట్రాక్ట్) పై జరుగుతాయి. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అభ్యర్థులను బ్యాంకు నియామక పక్రియ ద్వారా గ్రేడ్ ఎ-స్థాయి అసిస్టెంట్ మేనేజర్‌గా నియమిస్తారు.
 నోటిఫికేషన్ సమాచారం
 హోదా: ఎగ్జిక్యూటివ్
 ఖాళీల సంఖ్య: 500
 ఖాళీల వివరాలు: ఓబీసీ- 135, ఎస్సీ- 75, ఎస్టీ- 37, వికలాంగులు- 15
 అర్హత: డిగ్రీ
 వయసు: 20-25 ఏళ్లు (1-04-2015 నాటికి)
 వయోసడలింపు: ఓబీసీ- 3 ఏళ్లు, ఎస్సీ,ఎస్టీ-5 ఏళ్లు, వికలాంగులకు కేటగిరీని అనుసరించి మార్గదర్శకాల మేరకు 10 ఏళ్లకు తగ్గకుండా.
 దరఖాస్తు: ఆన్‌లైన్ విధానం
 దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 6, 2015
 ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 600; ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 100. క్రెడిట్ కార్డ్, డెబిట్‌కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, ఇతర క్యాష్ కార్డ్స్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జూలై 11, 2015
 వేతనం: తొలి ఏడాది రూ.17,000 రెండు, మూడు సంవత్సరాల్లో వరుసగా రూ. 18,500, 20,000 చెల్లిస్తారు.
 
 ఎంపిక విధానం
 ఇంతకు ముందు నుంచే బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ పరీక్ష సులభంగా ఉంటుంది. సాధారణంగా బ్యాంకు పరీక్షల్లో 5 విభాగాలు ఉంటాయి. ఇందులో ఉన్నవి 3 విభాగాలు మాత్రమే. జనరల్ ఎవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాలు లేవు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగాన్ని వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్‌గా పేర్కొన్నారు.
 
 పరీక్షా విధానం
 పరీక్ష సమయం: 90 నిమిషాలు
 అంశం    పశ్నలు     మార్కులు
 రీజనింగ్    50    50
 ఇంగ్లిష్ లాంగ్వేజ్    50    50
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్    50    50
 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు.
 సిలబస్
 
 రీజనింగ్
 వెర్బల్ రీజనింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, గణితానుగమనం, సిరీ స్, అనాలజీ, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డెరైక్షన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్, వర్డ్ ఫార్మేషన్ సిరీస్ త దితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి
 
 వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్:
 కామన్ ఎర్రర్స్, కాంప్రహెన్షన్, క్లోస్ టెస్ట్, ఫ్రేజ్ సబ్‌సి స్టిట్యూషన్, ఆర్డర్ ఆఫ్ సెంటెన్స్, జంబ్లింగ్ సెంటెన్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినానిమ్స్, యాంటోనిమ్స్, పాసేజెస్, మిస్‌స్పెల్ట్ వర్డ్స్,
 
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
 సంఖ్యామానం, కసాగు, గసాభా, నంబర్ సిరీస్, దశాంశ భిన్నాలు, సరాసరి, లాభ-నష్టాలు, చక్రవడ్ఢీ, బారువడ్ఢీ , కాలం-దూరం, కాలం-పని, ఎత్తులు, సంభావ్యత తదితర టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement